తిరుపతి చేరుకున్న బాలయ్య..!
Monday, December 26, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి. ఈ చిత్రంలో బాలయ్య సరసన శ్రియ నటించగా, తల్లి పాత్రలో హేమమాలిని నటించారు. జాగర్లమూడి క్రిష్ తెరకెక్కించిన గౌతమీపుత్ర శాతకర్ణి ఆడియోను ఈరోజు తిరుపతిలో భారీ స్ధాయిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసారు. ఈ ఆడియో రిలీజ్ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ముఖ్య అతిధులుగా హాజరు కానున్నారు.
తిరుపతి మున్సిపల్ మైదానంలో జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు బాలకృష్ణ ఈరోజు ఉదయం తిరుపతి చేరుకున్నారు. రేణుగుంట విమానాశ్రయంలో బాలకృష్ణ అభిమానులు ఘన స్వాగతం పలికారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రాన్ని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments