తమిళ చిత్రం రీమేక్ లో బాలయ్య...

  • IndiaGlitz, [Wednesday,December 23 2015]

త్వరలోనే ఓ తమిళ చిత్రంలో బాలయ్య నటించబోతున్నాడట. గతంలో లక్ష్మీనరసింహ వంటి రీమేక్ చిత్రంతో సెన్సేషనల్ హిట్ ను బాలయ్య అందుకున్నారు. ఇప్పుడు మరోసారి తమిళ చిత్రం రీమేక్ లో నటింప చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. తమిళంలో ఇటీవల అజిత్ హీరోగా నటించిన వేదాళం సినిమా సూపర్ హిట్టయింది.

సిస్టర్ సెంటిమెంట్ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం అక్కడ కలెక్షన్స్ విషయంలో కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. ఈ చిత్రాన్ని ఇప్పుడు బాలయ్య అంగీకారం కోసం నిర్మాతలు వెయిట్ చేస్తున్నారట. అయితే ప్రస్తుతం 99 సినిమాలను పూర్తి చేసిన బాలయ్య తన వందో చిత్రాన్ని బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేయబోతున్నాడు. మరి ఈ సినిమా రూపకల్పనకు సమయం పట్టేలాగానే కనపడుతుంది. మరి అప్పటి వరకు నిర్మాతలు వెయిట్ చేస్తారో, లేక బాలయ్యే వద్దంటాడో చూడాలి.