వయసుకు తగ్గ పాత్రలో బాలకృష్ణ?
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్లో అగ్ర హీరోలకి ఎంత వయసొచ్చినా వాళ్ళ అభిమానులు.. వారిని తెరపై కుర్రాళ్ళలాగే చూడాలని అనుకుంటారు. అందుకే కథానాయకులు కూడా వారి అభిమానుల కోసం అలా కనిపించాలని తపన పడతారు. వయసుతో సంబంధం లేకుండా.. డాన్సులు, ఫైట్లు చేస్తూ ఉంటారు. దానికోసం ఎంతటి శారీరక శ్రమనైనా ఓర్చడానికి సిద్ధంగా ఉంటారు టాలీవుడ్ అగ్ర హీరోలు. కథానుగుణంగా సినిమాల్లో చాలా మార్పులు వచ్చాయి. ప్రయోగాత్మక చిత్రాల్లో హీరోలు నటిస్తే.. ప్రేక్షకులతో పాటు అభిమానులు కూడా చూస్తున్నారు. నెమ్మదిగా హీరోల ఆలోచనల్లో కూడా మార్పు వస్తోంది. అందుకే ఇప్పుడు వారి వయసుకి సరిపడా కథల్లో నటించడానికి అగ్ర హీరోలు వెనుకాడడం లేదు.
అందులో భాగంగానే.. సీనియర్ కథానాయకుడు బాలకృష్ణ తన నిజ వయసు(57 సంవత్సరాలు)కి తగ్గట్టుగానే ఓ సినిమాలో నటించనున్నారని సమాచారం. వి.వి.వినాయక్ దర్శకత్వం వహించనున్న సినిమా కోసం బాలకృష్ణ గాడ్ ఫాదర్ పాత్రలో కనిపించనున్నారని సమాచారం. నిజానికి బాలకృష్ణ వయసుకి తగ్గ, వయసుకి మించిన పాత్రలు గతంలో చాలానే చేశారు. ‘పెద్దన్నయ్య’, ‘చెన్నకేశవరెడ్డి’, ‘ఒక్క మగాడు’ చిత్రాలు అందుకు నిదర్శనం. ప్రస్తుతం బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్‌లో నటిస్తున్నారు. అది పూర్తైన వెంటనే.. వినాయక్ సినిమాలో నటించే అవకాశం ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com