ముఖ్యమంత్రి గా బాలయ్య...!!
- IndiaGlitz, [Friday,February 01 2019]
నందమూరి బాలకృష్ణ తన తదుపరి చిత్రానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. దివంగత నేత ఎన్టీఆర్ బయోపిక్‌లో రాజకీయ ఘట్టానికి సంబంధించిన 'యన్.టి.ఆర్ మహానాయకుడు' చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ఈ నెలలో సినిమా విడుదల ఉంటుంది.
కాగా.. ఈ సినిమా తర్వాత తన బ్యానర్లోనే బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు నందమూరి బాలకృష్ణ. ఈ నెలలోనే పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. సింహా, లెజెండ్ చిత్రాల తర్వాత బాలకృష్ణ, బోయపాటి కలయికలో వస్తున్న చిత్రమిది.
గత రెండు చిత్రాల్లాగానే ఈ చిత్రంలో కూడా బాలకృష్ణను డబుల్ రోల్లో బోయపాటి చూపించబోతున్నాడని టాక్. అందులో ఓ పాత్రలో బాలకృష్ణ ముఖ్య మంత్రి పాత్రలో కనపడతారని సమాచారం. మరి దీనిపై బోయపాటి అండ్ టీం ఎలా స్పందిస్తారో చూడాలి.