మహేశ్ సరసన బాలయ్య హీరోయిన్...
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ మహేశ్, వంశీ పైడిపల్లి కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం 'మహర్షి'. మహేశ్ హీరోగా నటిస్తున్న 25వ చిత్రమిది. అశ్వినీదత్, దిల్‌రాజు, పివిపి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా ఫైనల్ షెడ్యూల్‌కు చేరుకుంది. ఈ షెడ్యూల్ ముగియగానే పాటల చిత్రీకరణ మాత్రమే మిగులుతుంది.
పాటల చిత్రీకరణ తర్వాత నిర్మాణాంతర కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలో అల్లరి నరేశ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. కాగా పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుంది.
అయితే లెటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ చిత్రంలో మరో హీరోయిన్ను కూడా తీసుకున్నారని ఫిలింనగర్ వర్గాల సమాచారం. ఆమె ఎవరో కాదు.. బాలయ్యతో లెజెండ్, డిక్టేటర్ చిత్రాల్లో నటించిన సోనాల్ చౌహాన్. మరి దీనిపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com