చిరంజీవి సోదరిగా బాలయ్య హీరోయిన్?
Send us your feedback to audioarticles@vaarta.com
ఆచార్య పూర్తయ్యాక మెగాస్టార్ చిరంజీవి మలయాళీ బ్లాక్ బస్టర్ లూసిఫెర్ రీమేక్ లో నటించబోతున్నారు. తమిళ దర్శకుడు మోహన్ రాజా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. దర్శకుడు ప్రస్తుతం స్క్రిప్ట్ కు తుదిమెరుగులు దిద్దుతున్నారు. అలాగే నటీనటుల ఎంపికపై కూడా ఫోకస్ పెట్టారు.
తాజాగా ఈ చిత్రం గురించి వినిపిస్తున్న ఓ గాసిప్ ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రంలో చిరంజీవి సోదరి పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ నటించనున్నట్లు సమాచారం. ఇప్పటికే చిత్ర యూనిట్ విద్యాబాలన్ తో సంప్రదింపులు మొదలు పెట్టిందట.
అంతా అనుకున్నట్లు జరిగితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ లోకి విద్యాబాలన్ అడుగుపెట్టడం ఖాయం అని అంటున్నారు. విద్యాబాలన్ తన పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే సినిమాలు అంగీకరిస్తున్నారు. అందుకే ఎక్కువగా ఆమె లేడి ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తున్నారు. బోల్డ్ రోల్ అయినా వెనుకడుగు వేయరు.
విద్యాబాలన్ తెలుగులో ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో బాలయ్య సరసన నటించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రం నిరాశపరిచినప్పటికీ ఎన్టీఆర్ సతీమణి పాత్రలో ఆమె సెట్ అయ్యారనే కామెంట్స్ వినిపించాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com