కల్యాణ్ రామ్‌తో కాలు కదుపుతున్న బాలయ్య భామ
- IndiaGlitz, [Wednesday,November 20 2019]
బాబాయ్ బాలకృష్ణతో 'జై సింహా' సినిమాలో ముగ్గురు హీరోయిన్స్‌లో ఒకరుగా నటించిన ముద్దుగుమ్మ నటాషా దోషి. ఈ సినిమా విడుదలై రెండేళ్లు దాటుతున్నా కూడా మరో తెలుగు సినిమాలో అవకాశాన్ని అందిపుచ్చుకోలేదు. అయితే చాలా గ్యాప్ తర్వాత అబ్బాయి నందమూరి కల్యాణ్‌తో ఈ సొగసరి ఓ స్పెషల్ సాంగ్‌లో కాలు కదపనుందట. వివరాల్లోకెళ్తే.. కల్యాణ్ రామ్ హీరోగా సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో నటిస్తోన్న చిత్రం 'ఎంత మంచివాడవురా'.
ప్రస్తుతం సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను జనవరి 15న విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. లేటెస్ట్ సమాచారం మేరకు ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌ను చిత్రీకరించాల్సి ఉంది. ఈ సాంగ్‌లో నటాషా దోషి నటించబోతుందని టాక్. చాలా రోజులుగా తెలుగులో మంచి బ్రేక్ కోసం వేచి చూస్తున్న నటాషా దోషికి మరి 'ఎంతమంచివాడవురా' ఎలా హెల్ప్ అవుతుందో వేచి చూడాలి.
నందమూరి కల్యాణ్ రామ్, మెహరీన్ హీరోయిన్‌గా నటిస్తుంది. సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో ఆదిత్యమ్యూజిక్, శ్రీదేవి మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా టీజర్‌కు చాలా మంచి స్పందన వచ్చింది.