బాలయ్య హీరోయిన్ పెళ్ళి...
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి బాలకృష్ణతో లెజెండ్, డిక్టేటర్ సినిమాల్లో నటించిన సోనాల్ చౌహాన్ రామ్‌తో పండగచేస్కో సినిమాలో కూడా నటించింది. ఇప్పుడీ ముంబై హీరోయిన్ పెళ్ళి పీటలెక్కడానికి రెడీ అయ్యింది. ప్రేమ పావురాలు సినిమాలో సల్మాన్‌తో నటించిన సీనియర్ హీరోయిన్ భాగ్యశ్రీ అందరికీ గుర్తుండే ఉంటుంది. భాగ్య శ్రీ తనయుడు దస్సాని ఇప్పుడు సోనాల్‌తో ప్రేమాయణం నడుపుతున్నాడట.
వీరిద్దరు కలిసి ఉన్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తున్నాయి. ఫంక్షన్స్‌లో కూడా ఇద్దరు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారట. త్వరలోనే వీరిద్దరూ ఓ ఇంటివారు కాబోతున్నారని ఫిలింనగర్ వర్గాలల్లో వార్తలు వినపడుతున్నాయి. తెలుగులో మూడు సినిమాల్లో మాత్రమే నటించిన సోనాల్ హీరోయిన్గా కాన్సన్ట్రేషన్ చేయకుండా అప్పుడే పెళ్ళి చేసుకోవాలని ఎందుకు తొందరపడుతుందోనని మరికొందరు అంటున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com