బాలయ్య హీరోయిన్ కన్ ఫర్మ్...
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి బాలకృష్ణ తన ప్రెస్టిజియస్ 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. రెండో షెడ్యూల్ లో గ్యాప్ రావడంతో అమెరికా వెళ్లాడు. సినిమా రెండో షెడ్యూల్ స్టార్ట్ అయినా హీరోయిన్ ఎవరనేది ఇంకా తెలియలేదు.
కానీ హీరోయిన్ విషయంలో దర్శకుడు క్రిష్ చాలా కేర్ తీసుకుని చాలా మంది హీరోయిన్స్ ను ఆడిషన్ చేశారు. బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ హీరోయిన్స్ ను పరిశీలించిన యూనిట్ సభ్యులు చివరకు శ్రియను హీరోయిన్ గా తీసుకోవాలని నిర్ణయించుకున్నారట. అల్రెడి ఈ చిత్రంలో బాలీవుడ్ నటి హేమామాలిని, కబీర్ బేడి వంటి స్టార్ కాస్ట్ ఉన్నారు. ఇప్పుడు హీరోయిన్ శ్రియ ఈ చిత్రంలో నటించడం ఖాయమైందని చిత్రసీమ వర్గాలు అంటున్నాయి. బిబో శ్రీనివాస్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి. బ్యానర్ పై వై.రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు ఈ చిత్రాని నిర్మిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com