క్రికెట‌ర్‌తో డేటింగ్ చేయ‌డం లేదంటున్న బాల‌య్య హీరోయిన్‌

  • IndiaGlitz, [Wednesday,May 29 2019]

సోనాల్ చౌహాన్‌.. ఈ అమ్మ‌డు బాల‌కృష్ణ 'లెజెండ్‌', 'డిక్టేట‌ర్' చిత్రాల‌తో పాటు రామ్‌తో 'పండ‌గ‌చేస్కో' చిత్రంలో హీరోయిన్‌గా న‌టించింది. ఇప్పుడు మ‌రే సినిమాలోనూ న‌టించ‌డం లేదు. అయితే ఈ అమ్మ‌డు ఇండియ‌న్ క్రికెట‌ర్ కె.ఎల్‌.రాహుల్‌తో డేటింగ్‌లో ఉందంటూ ఓ చానెల్ ఓ క‌థ‌నాన్ని ప్ర‌చురించింది. అంతే ఈ అమ్మ‌డు కోపంతో ఊగిపోయింది. రాహుల్ మంచి ప్ర‌తిభ ఉన్న ఆట‌గాడు. ఇంకా సమాచారం కావాలుకుంటున్న వదంతుల‌ను క్రియేట్ చేసిన వారినే అడ‌గండి అంటూ మండిప‌డింది. ఇంత‌కు ముందు కె.ఎల్‌.రాహుల్‌, నిధి అగ‌ర్వాల్‌తో క్లోజ్‌గా ఉన్నాడంటూ వార్త‌లు వినిపించాయి. ఇప్పుడు సోనాల్ పేరు బ‌లంగా విన‌ప‌డుతుంది.