దుబాయ్ వెళుతున్న బాల‌కృష్ణ‌..ఎందుకు?

  • IndiaGlitz, [Thursday,January 30 2020]

సింహా, లెజెండ్ చిత్రాల త‌ర్వాత నంద‌మూరి బాల‌కృష్ణ‌, బోయ‌పాటి శ్రీను కాంబోలో ఓ సినిమా ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. అయితే సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్ల‌నేలేదు. గ‌త చిత్రాలు భారీ విజ‌యాలు సాధించ‌డంతో వీరిద్ద‌రి హ్యాట్రిక్ సినిమాపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డాయి. ప్రారంభోత్సం ఎప్పుడో జ‌రిగిన‌ప్ప‌టికీ జ‌న‌వ‌రిలో సెట్స్‌లోకి వెళుతుంద‌ని అన్నారు. అంతా అనుకున్నారు. కానీ.. ఈ మ‌ధ్య స‌రైన హిట్ లేక‌పోవ‌డం.. బ‌డ్జెట్ పరంగా మార్పులు చేర్పులు జ‌ర‌గ‌డం వంటి ఇత్యాది కార‌ణాల‌తో ఈ సినిమా సెట్స్‌పైకి రానే లేదు. అస‌లు ఎప్పుడు సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ స్టార్ట‌వుతుంద‌నే దానిపై క్లారిటీ లేకుండా ఉండింది. అయితే లేటెస్ట్ స‌మాచారం మేర‌కు బాల‌కృష్ణ 106వ సినిమా షూటింగ్ ఫిబ్ర‌వ‌రి 15నుండి స్టార్ట్ కానుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఈ సినిమా కోసం ఇప్ప‌టికే బ‌రువు త‌గ్గి స్లిమ్ లుక్‌లో త‌యారైన బాల‌కృష్ణ.. హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ కూడా చేయించుకోబోతున్నాడ‌ట‌. వ‌చ్చే నెల‌లో బాల‌య్య‌కు దుబాయ్‌లో హెయిన్ ట్రాన్స్‌ప్లాంట్ ఆప‌రేష‌న్ జ‌రుగుతుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

ఈ సినిమాలో ప్ర‌తినాయ‌కుడిగా హీరో శ్రీకాంత్ న‌టించ‌బోతున్నార‌ట‌. అలాగే క‌మెడియ‌న్ సునీల్ కూడా ఇందులో న‌టిస్తార‌ని టాక్‌. అయితే ఈ సినిమాలో హీరోయిన్స్ ఎవ‌ర‌నే విష‌యంపై ఇంకా ఓ కొలిక్కి రాలేదు. సినిమాలో బాల‌కృష్ణ రెండు పాత్ర‌ల్లో క‌న‌ప‌డ‌తార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. అందులో ఓ పాత్ర అఘోర పాత్ర అనే సినీ వ‌ర్గాల్లో న్యూస్‌. మిర్యాల రవీంద‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

More News

పవన్ కళ్యాణ్ చిత్రానికి రూ. 20 కోట్ల సెట్

ప‌వ‌న్ 27వ చిత్రం క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో సైలెంట్‌గా స్టార్ట్ అయ్యింది. ఎ.ఎం.ర‌త్నం నిర్మిస్తోన్న ఈ సినిమాను పాన్ ఇండియా చిత్రంగా విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి.

ఆర్జీవీకి అదిరిపోయే కౌంటరిచ్చిన ‘ఐఎఫ్ఎస్’!!

టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తన ట్విట్టర్ వేదికగా తాజాగా ఓ ఆసక్తికర ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.

సినీ జర్నలిజంపై బుక్.. సమాచార సాయం చేయండి!

తెలుగు సినీ పాత్రికేయ చరిత్ర తెలుగు సినిమాకు 90 ఏళ్ల చరిత్ర ఉంది. తెలుగు సినిమా పుట్టినప్పటి నుంచే సినిమా పాత్రికేయమూ పుట్టింది.

సిగ్గుపడండి.. మీరు నాశనమైపోతారు: పూనమ్ కౌర్

యావత్ భారతదేశ వ్యాప్తంగా కలకలం రేపిన నిర్భయ రేప్ కేసులోని నలుగురు దోషులను ఫిబ్రవరి 1న ఉరితీయబోతున్నారన్న విషయం విదితమే.

రాజధాని వైజాగ్ ‘నై’: జీఎన్ రావు కమిటీ వివరణ

నవ్యాంధ్ర రాజధానిపై ఏపీ ప్రభుత్వం నియమించిన జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదికలో ఓ కొత్త విషయం వెలుగు చూసిందని..