యు.ఎస్ లో బాలయ్య సక్సెస్ టూర్..!
- IndiaGlitz, [Tuesday,January 17 2017]
నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి. సంక్రాంతి కానుకగా రిలీజైన గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రం రికార్డ్ స్ధాయి కలెక్షన్స్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్ సీస్ లో సైతం రికార్డ్ స్ధాయి కలెక్షన్స్ వసూలు చేస్తుంది. గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రం బాలయ్య 100వ సినిమా కావడం, విభిన్న కథా చిత్రాల దర్శకుడు క్రిష్ ఈ చిత్రాన్ని తెరకెక్కించడంతో ఓవర్ సీస్ లో 1 మిలియన్ డాలర్ వసూలు చేసి రికార్డ్ సృష్టించింది. ఈ సందర్భంగా ఓవర్ సీస్ లో ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియచేసేందుకు గాను సక్సెస్ టూర్ ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకుని ఓవర్ సీస్ లో ఫ్యాన్స్ బాలయ్యకు ఘన స్వాగతం చెప్పేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక టూర్ విషయానికి వస్తే...గురువారం సాయంత్రం బే ఏరియాలో, శుక్రవారం డల్లాస్, శనివారం డెట్రాయిట్, ఆదివారం న్యూజెర్సీ, ఫిలడెల్ఫియాలోని ధియేటర్లను బాలయ్య సందర్శించనున్నారు.