బాలయ్య 100వ సినిమా కథ ఆయనదా?
- IndiaGlitz, [Thursday,April 28 2016]
బాలయ్య ప్రెస్టిజియస్ 100వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి ప్రస్తుతం శరవేగంగా ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. దేవిశ్రీ ప్రసాద్ అల్రెడి ఈ సినిమాకు ట్యూన్స్ చేయడం మొదలేట్టేశాడు. ఫస్ట్ ప్రేమ్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై వై. రాజీవ్ రెడ్డి, జె.సాయిబాబు నిర్మాతలుగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్ర కథ, క్రిష్ ది కాదట.
గౌతమిపుత్ర శాతకర్ణిపై సినిమా చేయాలని క్రిష్ మెయిన్ పాయింట్ ను బాలయ్యకు చెప్పగా, ఆయన తిరుపతి ఎస్.వి.యూనివర్సిటీ ప్రొఫెసర్ రంగనాయకులును కలిసి ఆయన సహకారంతో క్రిష్ పాయింట్ ను బేస్ చేసుకుని కథను రాయించాడట. ఆ కథను క్రిష్ సినిమాటిక్ గా తెరకెక్కిస్తున్నాడని వాదనలు వినపడుతున్నాయి. అంటే బాలయ్య గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రానికి దర్శకుడు మాత్రమేనా ఏమో చూడాలి...