గౌతమీపుత్ర శాతకర్ణి పాత్ర లభించండం నా పూర్వ జన్మ సుకృతం - బాలకృష్ణ
Saturday, December 17, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
చిత్ర ప్రారంభం నుండే సంచలనాలకు కేంద్ర బిందువు అవుతున్న బాలయ్య శతచిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి. అభిమానుల సమక్షంలో కరీంనగర్ తిరుమల థియేటర్ లో అంగరంగ వైభవంగా గౌతమీపుత్ర శాతకర్ణి ధియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాలలోనూ వంద థియేటర్స్ లో రిలీజ్ అయిన గౌతమీ పుత్ర శాతకర్ణి ట్రైలర్ విడుదల కూడా చరిత్రకెక్కింది. నైజాం డిస్ట్రి బ్యూటర్ సుధాకర్ రెడ్డిగారి చేతుల మీదుగా ఈ ట్రైలర్ రిలీజ్ కావడం విశేషం.
ఈ సందర్భంగా డైరెక్టర్ క్రిష్ మాట్లాడుతూ... వందో చిత్రానికి బాలయ్య బాబు ఎందుకు ఈకథను ఎంచుకున్నాడో ఈ ట్రైలర్ కొంచెం చూపించింది. కోటి రతనాల వీణ తెలంగాణ, ఇక్కడ కోటిలింగాల సాక్షిగా శత చిత్ర యోథుడు నందమూరి అందగాడు బాలయ్య బాబు నూరోచిత్రం గౌతమీ పుత్ర శాతకర్ణి ట్రైలర్ ను మొదట మమ్మల్ని ఆశ్వీరదించిన సుధాకరరెడ్డి గారు రిలీజ్ చేస్తారు అన్నారు
నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ... చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా కరీనంగర్ లో ట్రైలర్ రిలీజ్ చేయడం... కోటిలింగాల వెళ్ళడం.. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ నుండి శాతవాహనకు సింహాద్వారం అయిన కోటిలింగాల నుండి అమరావతి కేంద్రంగా అంఖడ భారతావనిని పాలించిన మహాను భావుడు, శకపురుషుడు శాతకర్ణి అవడం మన తెలుగు వారికి ఎంతో గర్వ కారణం. ఈ ప్రపంచపటంలో ఈ దేశానికి గౌరవం ఇచ్చిన కానరాని భాస్కరుని వీరగాద ఈ శాత కర్ణి. మరి ఒక తెలుగు బిడ్డగా ప్రపంచ వ్యాప్తంగా .. తెలుగు జెండా ఎగుర వేసిన నందమూరి తారకరారమారావు గారి వారసునిగా ఈ కథను చాటి చెప్పడం నా ధర్మంగా భావించాను. తొంభై తొమ్మది సినిమాలు చేసాను.. వందో సినిమా ఏం చేయాలా అని కథలు వింటున్నాను. నేను అనుకునే స్థాయికి నానుండి నా అభిమానులు కోరుకునే స్థాయికి రాలేదు అని సతమతం అవుతున్న సమయంలో క్రిష్ గారు రావడం.. అంతకు ముందు ఆయనతో పరిచయం లేదు. దేవుడే కలిపాడు మాఇద్దరిని. డాక్టర్ అవుదామని యాక్టర్ అయ్యానని అందరూ అంటుంటారు.. కానీ యాక్టర్ నే అవుదామనకున్నాను.. కానీ డాక్టర్ గా సింహాలో చేసిన తర్వాత ఇండో అమెరికన్ హాస్పటల్ కి ఛైర్మన్ అయ్యాను. సింహా తర్వాత శాసనసభ్యుడ్ని అయ్యాను. జంబూ ద్వీప కాలమానం ప్రకారం ఉగాది జరుపుకుంటాం.
మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ భారత్ దేశంలో , విదేశాల్లో కూడా మారిషస్ లోకూడా నాకు తెలిసింది.. నాకు తెలిసింది మూడే మూడు శకాలు..శాలివాహాన, స్వాతంత్ర భారతదేశం పోరాటం.. మూడోది ఎన్టీఆర్ శకం.. ఎన్టీ ఆర్ ఎన్నో పథకాలతో ప్రజల గుండెల్లో నిలిచిపోయారు.. పోలీస్ పట్వారీ వ్యవస్థను రద్దు చేయడం.లాంటివి చేసారు.నేను ఇదే మొదటిసారి ట్రైలర్ చూడడం.. ప్రేక్షకుల మద్యనే చూడాలనే ఆగాను. ఎన్టీఆర్ అంటే అందరి గుండెల్లో నిండుగా, మెండుగా ఉంటాడు.. పుట్టిన వాడు గిట్టక తప్పదు.. ఎవరైతే తన పుట్టిన గడ్డకు, ప్రాంతానికి, దేశానికి పేరు ప్రఖ్యాతులు తేస్తారో వారి జన్మే ధన్యం అవుతుంది. వారు యుగపురుషులు అవుతారు.. వారికి చావు పుట్టకలతో పరిచయం ఉండదు..అలాంటి వారిలో ఒక శాతకర్ణి, ఒక అంబేద్కర్, ఒక గాంధీజీ, ఒక యన్టీఆర్ గారు.. ఎన్నో సినిమాలు చేసాను.. ఇలాంటి పాత్ర లభించండం నా పూర్వ జన్మ సుకృతం అనుకుంటాను. నరసింహా స్వామిని దర్శించికోవడం నాకు ఆనవాయితీ.. చిత్రం కోసం కాలం ఎదురుచూసిందేమో మా షూటింగ్ జరిగినన్నాళ్లూ ఎలాంటి ఆటంకాలు జరగలేదు.. ప్రకృతి కూడా సహాకరించింది. మా అందరి అదృష్టం.. మా నిర్మాతలు కూడా మంచి చిత్రం అందించాలని కోరుకున్నారు. క్రిష్ గారు యావత్ భారత్ దేశం గర్వించతగ్గ దర్శకుడు. సినిమా సినిమాకి ఎటువంటి పోలిక లేకుండా , ఏదో కొత్తదనం అందించాలని ఉవ్విళ్ళూరుతుంటారు..
ఆయన తెలుగు దర్శకుడు కావడం మన అదృష్టం..సాయిమాధవ్ గారి అద్భుతమైన సంభాషణలు అందించారు. పరబ్రహ్మశాస్త్రి గారు ఈ శాతవాహునులు తెలుగు వారిని నిరూపించింది ఆయన.. ఆయనకు ఈ సభా ముఖంగా నివాళులు అర్పిస్తున్నాను. చాలా మంది సినిమా అయిపోయిందంటే నమ్మలా.. మాములుగా అయితే రెండు మూడు సంవత్సరాలు పడుతుంది..ఇది ఎక్కువ కథను పరిశోధించడం కష్టం.. మేం ఎప్పుడూ చిన్న ప్రయత్నాలు చేయం.. పెద్ద ప్రయత్నాలే చేస్తాం.. ఆ ప్రయత్నం విజయం సాధించాలని కోరుకుంటున్నాం.. మా నాన్న గారి అడుగు జాడల్లోనే నడుస్తున్నాం.. అందుకే ఆదిత్య 369, భైరవద్వీపం, శ్రీరామరాజ్యం వంటి చిత్రాలు చేసాను...నా నిర్మాతలే నాకు శ్రీరామరక్ష. కెమెరా మెన్ బాబా గారు ఈ సినిమాకు అద్భుతంగా పనిచేసారు. అన్ని హాంగులతో ఈ సినిమా మీముందుకురాబోతుంది.. మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments