శభాష్ బాలయ్య ఫ్యాన్స్.. 500 మందికి ఉచిత వ్యాక్సిన్!
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి బాలకృష్ణ 61వ జన్మదినం సందర్భంగా ఆయన అభిమానులు గొప్ప మనసు చాటుకున్నారు. నటుడిగా రాణిస్తూ, ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తూ ఎన్నో సామజిక సేవా కార్యక్రమాలు చేస్తున్న బాలయ్యని ఆదర్శంగా తీసుకుని ఆయన అభిమానులు కూడా అదే బాటలో నడిచారు.
హైదరాబాద్ కూకట్ పల్లి భ్రమరాంబ థియేటర్ ఆవరణలో నందమూరి ఫ్యాన్స్ గోపిచంద్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ఈ ఉచిత వాక్సిన్ డ్రైవ్ నిర్వహించబడింది. నందమూరి అభిమానులు 500 మంది నిరుపేదలకు ఉచితంగా వ్యాక్సిన్ అందించారు.
ఈ కార్యక్రమం నిర్వహించిన అభిమానులకు ప్రశంసలు దక్కాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరావు కృష్ణారావు, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, కార్పొరేటర్లు మందడి శ్రీనివాసరావు, నార్నే శ్రీనివాసరావు పాల్గొన్నారు.
అలాగే బాలయ్యతో తదుపరి చిత్రం తెరకెక్కించబోతున్న ప్రముఖ దర్శకుడు గోపీచంద్ మలినేని, మైత్రి సంస్థ నిర్మాత రవిశంకర్ కూడా పాల్గొన్నారు. నేడు బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com