ఒక్క అభిమాని దూరమైనా భరించలేను.. బాలకృష్ణ ఎమోషనల్ కామెంట్స్
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి నటసింహం బాలయ్య తన అభిమానులని ఉద్దేశిస్తూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. అభిమానుల్లో బాలయ్య క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాలయ్య వెండి తెరపై సరైన మాస్ రోల్ లో కనిపిస్తే అభిమానులు పూనకాలతో ఊగిపోతారు. అలాంటి తన ఫ్యాన్స్ ని ఉద్దేశిస్తూ బాలయ్య కొన్ని వ్యాఖ్యలు చేశారు.
ఇదీ చదవండి: నటిని కాబట్టి నచ్చకపోయినా చేయాలి.. నిజంగానే ఆ పని చేసిన హీరోయిన్!
జూన్ 10న బాలకృష్ణ 61వ జన్మదిన వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా బాలయ్య తన ఫ్యాన్స్ కి ఓ విన్నపం తెలియజేశారు. 'నా ప్రాణ సమానులైన అభిమానులకు.. ప్రతి ఏటా జూన్ 10న నా పుట్టిన రోజు నాడు నన్ను కలిసేందుకు నలుదిక్కుల నుంచి అభిమానులు వస్తుంటారు. మీ అభిమానానికి సర్వదా విధేయుడ్ని. కానీ కరోనా విలయతాండవం చేస్తున్న ఈ విపత్కర పరిస్థితుల్లో మీరు రావటం అభిలషణీయం కాదు. నన్నింతటివాడ్ని చేసింది మీఅభిమానం ..ఒక్క అభిమాని దూరమైనా నేను భరించలేను. మీ అభిమానాన్ని మించిన ఆశీస్సు లేదు, మీ ఆరోగ్యాన్ని మించిన శుభాకాంక్ష లేదు. మీ కుటుంబం తో మీరు ఆనందంగా గడపటమే నా జన్మదినవేడుక .. దయచేసి రావద్దని మరీ మరీ తెలియజేస్తూ .. ఈ విపత్కాలంలో అసువులు బాసిన నా అభిమానులకూ కార్యకర్తలకూ అభాగ్యులందరికీ నివాళులర్పిస్తూ .. మీ నందమూరి బాలకృష్ణ' అని బాలయ్య సోషల్ మీడియాలో అభిమానులకు తెలియజేశారు.
ప్రస్తుతం కరోనా సమయంలో తమపుట్టిన రోజునాడు ఎలాంటి కార్యక్రమాలు చేయవద్దని హీరోలు తమ అభిమానులకు తెలియజేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి దర్శకత్వంలో 'అఖండ' అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య పుట్టిన రోజునాడు తన కొత్త చిత్రాల ప్రకటన వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments