నెక్ట్స్ ఇయర్ బాలయ్య డబుల్ ధమాకా
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి నటసింహం బాలకృష్ణ ‘జై సింహా’ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని మళ్ళీ వరుస సినిమాలు చేస్తున్నారు. ఎన్టీఆర్ బయోపిక్‌గా తెరకెక్కుతున్న ‘యన్.టి.ఆర్’ చిత్రాన్ని ఇటీవలే లాంఛనంగా ప్రారంభించిన బాలయ్య.. త్వరలో మరో సినిమాను కూడా లాంచ్ చేయనున్నారు. ఆ వివరాల్లోకి వెళితే.. వి.వి.వినాయక్ డైరెక్షన్‌లో బాలకృష్ణ ఓ సినిమా (ఎన్.బి.కె.103) చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కల్యాణ్ నిర్మించనున్నారు.
ఈ మూవీని ఈ నెల 27న లాంచ్ చేయడానికి ముందుగా ప్లాన్ చేశారు. అనంతరం నిరవధిక చిత్రీకరణను ప్రారంభించి.. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాని విడుదల చేయాడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక మరోవైపు.. ఇప్పటికే లాంచ్ చేసిన ‘యన్.టి.ఆర్’ (ఎన్.బి.కె.104) సినిమాని ఈ ఏడాది దసరా తర్వాత సెట్స్ పైకి తీసుకుని వెళ్లనున్నారు. ఈ సినిమాలో బాలయ్య లీడ్ రోల్ పోషిస్తూ.. నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీని వచ్చే ఏడాది వేసవికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారని సమాచారం. మొత్తానికి.. ఈ ఏడాది ‘జై సింహా’తో సరిపెట్టిన బాలయ్య.. వచ్చే ఏడాది మాత్రం తన అభిమానులకు డబుల్ ట్రీట్ ఇవ్వనున్నారన్న మాట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments