నడిగర్ సంఘం అధ్యక్షుడు నాజర్ ను అభినందించిన నందమూరి బాలకృష్ణ
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న చిత్రం డిక్టేటర్. శ్రీవాస్ దర్శకత్వంలో ఈరోజ్ ఇంటర్నేషనల్, వేదాశ్వక్రియేషన్స్ అసోసియేషన్ తో ఈ చిత్రం రూపొందుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ చిత్రంలో నాజర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల తమిళనాడులో జరిగిన నడిగర్ సంఘం ఎన్నికల్లో నాజర్ అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా లోకేషన్ బాలకృష్ణ, శ్రీవాస్, అంజలి సహా చిత్రయూనిట్ సభ్యులు నాజర్ ను అభినందించారు. నడిగర్ సంఘం అధ్యక్షుడుగా పేద కళాకారుల అభ్యున్నతికి పాటుపడి అందరికీ ఆదర్శంగా నిలవాలని బాలకృష్ణ నాజర్ ను అభినందించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments