బాలయ్య కన్ఫర్మ్ చేశాడు
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి బాలకృష్ణ తదుపరి చిత్రంపై పలు వార్తలు సోషల్ మీడియాలో వినపడుతున్నాయి. అయితే ఈ వార్తలపై బాలకృష్ణ నిన్న ఓ క్లారిటీ ఇచ్చేశారు. `యన్.టి.ఆర్` చిత్రం `యన్.టి.ఆర్ కథానాయకుడు`.. `యన్.టి.ఆర్ మహానాయకుడు` అనే రెండు భాగాలుగా విడుదల కానుంది. తొలి భాగం జనవరి 9న విడుదలవుతుంటే.. రెండో భాగం ఫిబ్రవరి 7న విడుదలవుతుంది.
రెండో భాగం విడుదలైన తర్వాత బాలయ్య తన తదుపరి చిత్రాన్ని మొదలు పెట్టనున్నాడట. బాలకృష్ణ నెక్ట్స్ మూవీని వినాయక్‌తో చేస్తాడా? లేదా బోయపాటితో చేస్తాడా? అనే దానిపై క్లారిటీ ఇచ్చారు.
బాలయ్య నెక్ట్స్ మూవీ .. బోయపాటి దర్శకత్వంలో ఫిబ్రవరిలో మొదలు కానుంది. అది కూడా బాలకృష్ణ స్వంత బ్యానర్ ఎన్.బి.కె.ఫిలింస్ పై నందమూరి బాలకృష్ణ నిర్మాతగా నిర్మించనున్నారు.
దీనిపై బోయపాటి శ్రీను మాట్లాడుతూ `మా కాంబినేషన్లో సింహా, లెజెండ్ సినిమాల తర్వాత మా కాంబినేషన్లో వస్తోన్న చిత్రమిది. ఆ రెండు సినిమాలకు మించే పది శాతం ఎక్కువగానే సినిమా ఉంటుందని హామీ ఇస్తున్నాను` అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments