పదేళ్లకో హిట్, ఆస్కార్.. రెహమాన్ ఎవరు.. కాలి గోటితో సమానం
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి నటసింహం బాలకృష్ణ మరో వివాదంలో కేంద్ర బిందువుగా మారారు. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ గురించి బాలయ్య చేసిన వ్యాఖ్యలు ట్రోలింగ్ కు దారి తీశాయి. రెహమాన్ అభిమానులు బాలయ్యని ట్రోల్ చేస్తూ విమర్శిస్తున్నారు. ఇంతకీ బాలయ్య రెహమాన్ ని ఉద్దేశించిన చేసిన వ్యాఖ్యలు ఏంటో చూద్దాం.
ఇదీ చదవండి: అప్పుడే ఆయన ప్రేమలో పడ్డా, కొంతమందికి తెలుసు: హీరోయిన్
ఓ ఇంటర్వ్యూలో బాలయ్య తన ఆల్ టైం క్లాసిక్ ఆదిత్య 369 గురించి మాట్లాడుతూ.. ఆ చిత్రంలో పాటలు ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా అద్భుతంగా ఉంటాయని అన్నారు. ఇళయరాజా గారు అద్భుతమైన బాణీలు అందించారు. పాటలు,పద్యాలు అన్నీ ఆ చిత్రానికి అద్భుతంగా కుదిరాయి.
ఆ చిత్రానికి ఇళయరాజా సంగీత దర్శకుడు అంటే ఎవరూ నమ్మరు. ప్రతి సంగీత దర్శకుడికి ఓ స్టైల్ ఉంటుంది. ఇళయరాజా గారు తన స్టైల్ కు భిన్నంగా అద్భుతమైన మ్యూజిక్ ఆ చిత్రానికి ఇచ్చారు. వివిధ సంగీత దర్శకుల స్టైల్ గురించి మాట్లాడేటప్పుడు రెహమాన్ ప్రస్తావన వచ్చింది. 'రెహమాన్ ఎవరో నాకు తెలియదు. పదేళ్లకో హిట్ ఇస్తాడు.. ఆస్కార్ అవార్డు.. అవన్నీ పట్టించుకోను. రామారావు గారికి భారత రత్న అన్నప్పుడు కూడా అది ఆయన కాలిగోటితో సమానం అని చెప్పా.
అది ఇచ్చిన వాళ్లకు గౌరవం కానీ.. భారత రత్న వల్ల రామారావు గారికి గౌరవం ఏంటి అని బాలయ్య మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒక సినిమా సంగీతం బావుంది అంటే అందులో సంగీత దర్శకుడితో పాటు రచయిత, గాయకులు, దర్శకుడు, అభినయించిన నటీనటుల భాగస్వామ్యం కూడా ఉంటుంది అని బాలయ్య అన్నారు.
రెహమాన్ ఎవరో తెలియదు అని బాలయ్య వ్యాఖ్యానించడం వివాదంగా మారింది. బాలయ్య వ్యాఖ్యలని కొంతమంది ఫిలిం క్రిటిక్స్ కూడా తప్పుబడుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout