తండ్రి టైటిల్ తో బాలయ్య...

  • IndiaGlitz, [Tuesday,October 10 2017]

స్వ‌ర్గీయ ఎన్టీఆర్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ చిత్రాల్లో మ‌న‌కు ముందుగా గుర్తుకొచ్చే పేరల్లో 'దాన‌వీర‌శూర‌క‌ర్ణ‌' కూడా ఒక‌టి. ఇచ్చిన మాట‌పై నిల‌బ‌డుతూ, స్నేహానికి ప్రాణ‌మిచ్చే మ‌హాభార‌త క‌ర్ణుడి ప్ర‌ధాన పాత్ర‌లో సాగే సినిమా అది. ఇప్పుడు ఈ టైటిల్‌లో ప్ర‌దాన‌మైన క‌ర్ణ అనే టైటిల్ బాల‌కృష్ణ 102వ సినిమాకు ప‌రిశీల‌న‌లో ఉంద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం.

గ‌తంలో ఇదే సినిమాకు జ‌య‌సింహా అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు వార్త‌లు వినిపించాయి. అయితే ఇప్పుడు క‌ర్ణ పేరు విన‌ప‌డుతుంది. ఈ సినిమా క్లైమాక్స్ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌లో ఉంది. ఇందులో బాల‌కృష్ణ‌తోపాటు న‌టాషా దోషి కూడా పాల్గొంటున్నారు. కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో సి.క‌ల్యాణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

More News

శర్వా ప్రాజెక్ట్ ఆగిందా?

ఈ ఏడాది సంక్రాంతికి శతమానం భవతి, దసరాకు మహానుభావుడు సినిమాలతో హిట్స్ కొట్టాడు హీరో శర్వానంద్. తర్వాత శర్వానంద్ ఏ సినిమాలో చేస్తాడోననే దానిపై కొంత కార్లిటీ వచ్చేలానే కనపడుతుంది.

తమిళ అర్జున్ రెడ్డి.. దర్శకుడు, హీరోయిన్

ఈ ఏడాది ఆగస్టులో విడుదలైన అర్జున్రెడ్డి తెలుగునాట సెన్సేషనల్ విజయాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఇప్పుడు దక్షిణాదిన తమిళం, కన్నడతో పాటు బాలీవుడ్లో కూడా రీమేక్ చేస్తున్నారు. బాలీవుడ్ లో రీమేక్ లో రణవీర్ నటిస్తాడని అంటున్నారు.

ఒత్తిడి లేక‌పోతే ప‌నులు పూర్తికావు - ఓంకార్‌

కింగ్‌ నాగార్జున, సమంత, శీరత్‌ కపూర్‌ ప్రధాన తారాగణంగా పివిపి సినిమా, మాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఓక్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై.లి. బేనర్స్‌పై ఓంకార్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'రాజుగారి గది-2'. ఈ సినిమా అక్టోబర్‌ 13న విడుదలకాబోతుంది.

ఐ లైక్ ఇట్ దిస్ వే ఇండిపెండెంట్ ఫిలిం ప్రీమియర్

టివి 9  యాంకర్ ప్రేమ మాలిని దర్శకత్వంలో బిగ్ బాస్ ఫెమ్ అర్చన, శివకుమార్ రామచంద్రవరపు లీడ్ రోల్స్ లో నటించిన ఐ లైక్ ఇట్ దిస్ వే  ఇండిపెండెంట్ ఫిలిం ప్రీమియర్ షోని ఈ ఆదివారం ప్రసాద్ ల్యాబ్ లో ప్రదర్శించారు. ఈ ప్రీమియర్ కి ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల తోపాటు దర్శకుడు నీలకంఠ, దర్శకులు నందిని రెడ్డి, ఇంద్రగంటి మోహన కృష్ణ, హీరోయిన్ మధు షా

'గల్ఫ్' రిలీజ్ డేట్

శ్రావ్య ఫిలిమ్స్ పతాకంపై పి. సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో యక్కలి రవీంద్రబాబు, యమ్. రామ్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న `గల్ఫ్`. అక్టోబర్ 13న సినిమా విడుదలవుతుంది.