గోపీచంద్ ఆడియోకి బాలయ్య అతిధి...
Send us your feedback to audioarticles@vaarta.com
గోపీచంద్ హీరోగా ఎ.ఎస్.రవి కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం సౌఖ్యం. ఈ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. గోపీచంద్ సరసన రెజీనా నటించింది. ఇటీవల గోపీచంద్, శ్వేతా భరద్వాజ్ లపై చిత్రీకరించిన పాటతో షూటింగ్ పూర్తయ్యింది. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించిన సౌఖ్యం ఆడియోను ఒంగోలులో ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ నెల 13న ఈ ఆడియో రిలీజ్ చేయనున్నారు. ఈ వేడుకకు నందమూరి నట సింహం బాలక్రిష్ణ ముఖ్య అతిధిగా హాజరు కానున్నట్టు సమాచారం. డైరెక్టర్ ఎ.ఎస్.రవి కుమార్ బాలయ్యతో వీరభద్ర మూవీ చేసినప్పటి నుంచి మంచి పరిచయం వుంది. అలాగే బాలయ్యతో రైటర్స్ కోన, గోపీ మోహన్ లకు కూడా మంచి పరిచయం ఉండడంతో..బాలయ్య వెంటనే ఓకె అన్నారట. బాలయ్య ఆడియో రిలీజ్ చేస్తుండడంతో సౌఖ్యం కి మరింత క్రేజ్ రావడం ఖాయం. మరి..సౌఖ్యం ఎలాంటి సక్సెస్ సాధిస్తుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments