పేరు మార్చుకున్న బాల‌య్య‌..!

  • IndiaGlitz, [Friday,January 06 2017]

నంద‌మూరి న‌ట సింహం బాల‌కృష్ణ న‌టించిన 100వ చిత్రం గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి. ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా ఈనెల 12న‌ వ‌రల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది. గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి ప్రీమియ‌ర్ షోకు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కెసిఆర్ ను బాల‌య్య ఆహ్వానించారు. ఈరోజు బ‌స‌వ‌తార‌కం హాస్ప‌ట‌ల్ లో బాల‌కృష్ణ మీడియా మీట్ ఏర్పాటు చేసారు.

ఈ మీడియా స‌మావేశంలో బాల‌కృష్ణ మాట్లాడుతూ...ఇక నుంచి త‌న‌ను బ‌స‌వ తార‌క రామ‌పుత్ర బాల‌కృష్ణ గా పిల‌వాల‌ని మీడియా ద్వారా స‌న్నిహితులు, శ్రేయోభిలాష‌ల‌కు తెలియ‌చేసారు. మా అమ్మే నాకు ఇన్ స్పిరేష‌న్. అందుక‌నే ఇక నుంచి బ‌స‌వ తార‌క రామ‌పుత్ర బాల‌కృష్ణ‌గా పిల‌వాలి అని కోరుతున్నాను అని తెలిపారు. ఈ సంద‌ర్భంగా గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి సినిమాకి ప‌న్ను మిన‌హాయింపు ఇచ్చినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కెసిఆర్ కు థ్యాంక్స్ తెలియ‌చేసారు.