రెగ్యులర్ షూటింగ్ లో బాలకృష్ణ, బోయపాటి చిత్రం

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ 'సింహా', 'లెజెండ్' తర్వాత నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను చేస్తున్న మూడో సినిమా, ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న అత్యంత ప్రెస్టీజియస్ మూవీ షూటింగ్ ఈ రోజు, మార్చ్ 2 ఉదయం ఆర్ ఎఫ్ సి లో మొదలయింది. నటసింహ బాలకృష్ణ పాల్గొనగా ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ కంపోజ్ చేసిన ఫైట్ చిత్రీకరణతో దర్శకులు బోయపాటి శ్రీను రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించారు. ఈ షెడ్యూల్ ఏకధాటిగా జరుగుతుంది. బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం, ప్రేక్షకులు, అభిమానులు ఎక్స్పెక్ట్ చేస్తున్న స్థాయిలో మోస్ట్ పవర్ఫుల్ గా మంచి కథా బలం తో పాటుగా చాలా గ్రాండియర్ గా తెరకెక్కుతోంది. థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న 'బాలయ్య బోయపాటి 3' కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి.

నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: థమన్‌ ఎస్‌.ఎస్‌, సినిమాటోగ్రఫీ: రాంప్రసాద్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌: ఎ.ఎస్‌.ప్రకాష్‌, ఫైట్ మాస్టర్స్: రామ్ - లక్ష్మణ్, నిర్మాత: మిర్యాల రవీందర్‌రెడ్డి, దర్శకత్వం: బోయపాటి శ్రీను.

More News

‘మేజ‌ర్’ సినిమాలో శోభితా ధూళిపాల

26/11..పాకిస్థాన్ ముష్క‌రులు ముంబైలోని తాజ్ హోట్‌లోపై దాడి జ‌రిపిన రోజుది. చాలా మంది ప్రాణాల‌ను కోల్పోయారు.

ప‌వ‌ర్‌ఫుల్ టైటిల్‌తో సూర్య 39...

హీరో సూర్య త‌న 38వ చిత్రం శూర‌రై పోట్రుని ఈ ఏప్రిల్‌లో విడుద‌ల చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే.

'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్' ఫ‌స్ట్ సింగిల్ విడుద‌ల

అఖిల్ అక్కినేని హీరోగా మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై తెర‌కెక్కుతున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్ ఆడియో ఆల్బమ్

కొరటాలకు షాకిచ్చిన చిరంజీవి!!

మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. చిరంజీవి 152వ చిత్ర‌మిది.

'RRR' ఫుల్ ఫామ్ ఇదేనట.. త్వరలో అధికారిక ప్రకటన!

ఓటమి ఎరుగని దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘RRR’. ఇప్పటికే భారీ చిత్రాలతో ఇండియన్ రికార్డ్స్‌ను బద్దలు కొట్టిన జక్కన్న మరోసారి తన రికార్డులు తానే బద్దలు కొట్టుకునే దిశగా