షాకిస్తున్న బాలయ్య, బోయపాటి సాహసం ?
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ అఖండ. మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. బాలయ్య, బోయపాటి కాంబోకి ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
వీరిద్దరి కాంబోలో వచ్చిన సింహా, లెజెండ్ చిత్రాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. హ్యాట్రిక్ కాంబినేషన్ లో వస్తున్న అఖండ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. అఖండ రిలీజ్ డేట్ పై ఆసక్తికర ప్రచారం జోరందుకుంది. బాలయ్య, బోయపాటి సాహసం చేయబోతున్నట్లు టాక్.
సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద సర్కార్ వారి పాట, రాధే శ్యామ్, పవన్ - రానా చిత్రం లాంటి భారీ చిత్రాలు ఫిక్స్ అయ్యాయి. దీనితో అఖండ చిత్రాన్ని ముందుగానే రిలీజ్ చేయాలనీ బోయపాటి భావిస్తున్నాడు. దీనికోసం దసరా సీజన్ ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
దసరా సీజన్ కి అంటే అక్టోబర్ 13న ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. అందుకే బాలయ్య, బోయపాటి నిర్ణయాన్ని సాహసం అని అంటున్నారు. కానీ బాలయ్య, బోయపాటి మాత్రం లెక్కలు వేసుకుని మరీ దసరా రిలీజ్ ప్లాన్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ మూవీలో బాలయ్య మూడు విభిన్నమైన గెటప్స్ లో కనిపించబోతున్నారు. అందులో ఒకటి అఘోర పాత్ర. ఇప్పటికే టీజర్ లో చూశాం.
బాలయ్యకు జోడిగా హాట్ బ్యూటీ ప్రగ్యా జైశ్వాల్ నటిస్తోంది. ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments