బాలయ్య భారీ ఆలోచన....
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి బాలకృష్ణ 100వ సినిమా `గౌతమీపుత్ర శాతకర్ణి` తెలుగులో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడీ సినిమా తమిళ్‌లోనూ విడుదలవుతోంది. ఇటీవల 'బాహుబలి2' తమిళ్‌లో రిలీజ్ అయి కలెక్షన్ల పరంగా కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. 'గౌతమిపుత్ర శాతకర్ణి' కూడా అదే బాటలో వెళ్తోంది. ఈ సినిమా ఆడియో విడుదలను కూడా చెన్నైలో భారీ రేంజ్‌లో విడుదల చేశారు. నేను చెన్నైలోనే పుట్టాను. ఇక్కడ గాలి పీల్చి, నీరు త్రాగి పెరిగాను కాబట్టి తమిళ బిడ్డను అని చెప్పుకోడానికి గర్వపడతానని తెలిపారు బాలయ్య.
యంగ్ హీరోస్‌కు పోటీగా ఈ సీనియర్ హీరో తమిళ మార్కెట్‌పై కన్నేశాడు. అందులో భాగంగా ఈ సినిమాను తమిళనాడులో 400 కేంద్రాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. 'బాహుబలి2' రికార్డులను 'గౌతమిపుత్ర శాతకర్ణి' రిపీట్ చేస్తుందని దర్శకనిర్మాతలు ఎంతో నమ్మకంతో వున్నారు. ఈ చిత్రాన్ని ప్రమోట్ చేసే విషయంలో దర్శకుడు క్రిష్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని తెలుస్తోంది. బాలకృష్ణ, శ్రీయలతోపాటు ప్రముఖ తమిళ నటీనటులతో చిత్ర ప్రచారాన్ని భారీగా చెయ్యాలని దర్శకుడు క్రిష్ భావిస్తున్నాడు. మరి బాలకృష్ణ సినిమా తమిళ ప్రేక్షకుల్ని ఎంతవరకు ఆకట్టుకుంటుంది? ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో తెలుసుకోవాలంటే కొంతకాలం ఆగాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com