తండ్రులుగా తనయులు...
Send us your feedback to audioarticles@vaarta.com
సినీ రంగంలో తండ్రి పాత్రలో తనయుడు నటించడం అనేది ఓ అనుభూతి. ఇప్పుడు ఇండస్ట్రలో ఇద్దరు హీరోలు వారి తండ్రుల పాత్రల్లో కనిపించబోతున్నారు. ఒకరు నందమూరి బాలకృష్ణ. ఈయన నందమూరి తారకరామారావు పాత్రలో కనిపిస్తుండగా.. కల్యాణ్ రామ్.. ఈయన హరికృష్ణ పాత్రలో కనిపిస్తున్నారు. నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్రలో నటిస్తూ నిర్మిస్తున్నఎన్టీఆర్ బయోపిక్ `యన్.టి.ఆర్`.
నిజ జీవితాన ఎన్నికల సమయంలో హరికృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ చైతన్య రథానికి డ్రైవర్‌గా వ్యవహరించారు. ఇప్పుడు హరికృష్ణ పాత్రలో ఆయన తనయుడు కల్యాణ్ రామ్ నటిస్తున్నారు. ``30 ఏళ్లకు ముందు బాబాయ్‌తో `బాలగోపాలుడు` చిత్రంలో నటించాను. మళ్లీ ఇప్పుడు .. బాబాయ్ వాళ్ల నాన్నగారిలా.. నేను, మా నాన్నగారిలా..` అంటూ మెసేజ్‌తో పాటు లొకేషన్లో తీసిన ఫోటోను షేర్ చేశారు కల్యాణ్ రామ్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Diya Harini
Contact at support@indiaglitz.com