తండ్రులుగా త‌న‌యులు...

  • IndiaGlitz, [Friday,October 12 2018]

సినీ రంగంలో తండ్రి పాత్ర‌లో త‌నయుడు న‌టించ‌డం అనేది ఓ అనుభూతి. ఇప్పుడు ఇండ‌స్ట్ర‌లో ఇద్ద‌రు హీరోలు వారి తండ్రుల పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. ఒక‌రు నంద‌మూరి బాల‌కృష్ణ‌. ఈయ‌న నంద‌మూరి తారక‌రామారావు పాత్ర‌లో కనిపిస్తుండ‌గా.. క‌ల్యాణ్ రామ్‌.. ఈయ‌న హ‌రికృష్ణ పాత్ర‌లో క‌నిపిస్తున్నారు. నంద‌మూరి బాల‌కృష్ణ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తూ నిర్మిస్తున్నఎన్టీఆర్ బ‌యోపిక్ 'య‌న్‌.టి.ఆర్‌'.

నిజ జీవితాన ఎన్నిక‌ల స‌మ‌యంలో హ‌రికృష్ణ త‌న తండ్రి ఎన్టీఆర్ చైత‌న్య ర‌థానికి డ్రైవ‌ర్‌గా వ్య‌వ‌హ‌రించారు. ఇప్పుడు హ‌రికృష్ణ పాత్ర‌లో ఆయ‌న త‌న‌యుడు క‌ల్యాణ్ రామ్ న‌టిస్తున్నారు. ''30 ఏళ్ల‌కు ముందు బాబాయ్‌తో 'బాల‌గోపాలుడు' చిత్రంలో న‌టించాను. మ‌ళ్లీ ఇప్పుడు .. బాబాయ్ వాళ్ల నాన్న‌గారిలా.. నేను, మా నాన్న‌గారిలా..' అంటూ మెసేజ్‌తో పాటు లొకేష‌న్‌లో తీసిన ఫోటోను షేర్ చేశారు క‌ల్యాణ్ రామ్‌.