ఎన్టీఆర్ పై సినిమా తీస్తాః బాలయ్య
Send us your feedback to audioarticles@vaarta.com
ఎన్నో విలక్షణమైన పాత్రల్లో నటించి, తన నటనతో ఆ పాత్రలకు ప్రాణం పోసిన తిరుగులేని కథానాయకుడు నటరత్న నందమూరి తారక రామారావు. సినిమా రంగంలోనే కాదు, రాజకీయ రంగంలో కూడా ఎన్టీఆర్ తనదైన ముద్ర వేశారు. ఎన్టీఆర్‌కు భారత్నరత్న ఇవ్వాలనే వాదన కూడా వినపడుతుంది.
బాలయ్య తనయుడు నటసింహ నందమూరి బాలకృష్ణ కూడా సినిమాల్లో హీరోగానే కాదు, రాజకీయాల్లో ఎమ్మెల్యేగా తన వంతు సేవ చేస్తున్నారు. రీసెంట్గా కృష్ణాజిల్లా నిమ్మకూరు ప్రాంతానికి బాలకృష్ణ, లోకేష్‌లు రాజకీయ పర్యటన చేశారు. ఈ పర్యటనలో భాగంగా ఎన్టీఆర్ జీవితంపై సినిమా తీయాలనుకుంటున్నట్టు తెలియజేశారు బాలయ్య. సేకరించాల్సిన వివరాలు చాలానే ఉన్నాయి ఆ వివరాలు దొరకగానే సినిమాను అనౌన్స్ చేస్తానని బాలకృష్ణ తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com