Bhagavanth Kesari:బాలయ్య అదరగొట్టాడుగా.. 'భగవంత్ కేసరి' ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే..?
Send us your feedback to audioarticles@vaarta.com
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా గురువారం థియేటర్లలోకి విడుదలైన భగవంత్ కేసరి’ మూవీ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. బాలయ్య రెగ్యులర్ మూవీల్లో ఉండే డైలాగ్స్, ఫైట్స్.. దర్శకుడు అనిల్ రావిపూడి మూవీల్లో ఉండే కామెడీకి భిన్నంగా ఈ చిత్రం తెరకెక్కింది. కూతురు సెంటిమెంట్‌తో తెలంగాణ యాసలో రూపొందించిన ఈ సినిమా అభిమానులకు కొత్త అనుభూతి కలిగించింది. దీంతో బాక్సాఫీస్ వద్ద అదరగొడుతుంది. తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రూ.32.33 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు చిత్ర నిర్మాతలు అధికారికంగా తెలియజేశారు. బాక్సాఫీస్ విస్పోటనం, దసరా విన్నర్ అంటూ ఓ పోస్టర్ విడుదల చేశారు.
భగవంత్ కేసరి విజయంతో హ్యాట్రిక్ కొట్టిన బాలయ్య..
ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ సుమారు రూ.65 కోట్ల వరకు జరిగిందని తెలుస్తోంది. ఈ లెక్కన చూస్తే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.130 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. విజయ్ ‘లియో’, రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రాల నుంచి పోటీ ఉండటంతో ఆ మేర కలెక్షన్స్ రాబడుతుందో లేదో అనుమానాలు ఉన్నాయి. అయితే సినిమాకు ఓవరాల్‌గా హిట్ టాక్ రావడంతో పాటు దసరా సెలవులు కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కడతారు అని అంచనా వేస్తున్నారు. ఈ వీకెండ్ ముగిసే లోపే రూ.100కోట్లు రాబట్టడం ఖాయమని చెబుతున్నారు. మొత్తానికి అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో మంచి ఊపు మీదున్న బాలయ్య.. భగవంత్ కేసరి విజయంతో హ్యాట్రిక్ కొట్టారు.
ఫ్యాన్సీ రేటుకు దక్కించుకున్న అమెజాన్ ప్రైమ్..
మరోవైపు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ గురించి అప్పుడే చర్చ మొదలైంది. బాలయ్య గత రెండు చిత్రాలు అఖండ, వీరసింహారెడ్డి డిస్నీ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే 'భగవంత్ కేసరి' మాత్రం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. ఫ్యాన్సీ రేటుకు ఈ మూవీ హక్కులు అమెజాన్ దక్కించుకున్నట్లు సమాచారం. డిసెంబర్ రెండో వారంలో మూవీని ప్రైమ్‌లో రిలీజ్ చేయనున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments