బాలకృష్ణతో అక్ష కామెడీ చేస్తోందా?
Send us your feedback to audioarticles@vaarta.com
'కందిరీగ' సినిమాలో తెలంగాణ పోరిగా అక్ష చేసిన సందడి అంతా ఇంతా కాదు. మళ్లీ ఆ స్థాయి పాత్ర అక్షని వరించనేలేదు. అందుకే రేసులో చాలా అంటే చాలా వెనుకబడిందీ అమ్మడు. కట్ చేస్తే.. ఇప్పుడు 'కందిరీగ' స్థాయిలో కామెడీని పండించే అవకాశం 'డిక్టేటర్'లో దక్కించుకుందని ఇన్‌సైడ్ సోర్స్ చెప్పుకొస్తోంది.
ఈ సినిమా కోసం బాలకృష్ణతో కలిసి అక్ష చేసే కామెడీ సినిమాకే హైలెట్‌గా నిలుస్తుందట. ఈ సినిమా తరువాత అక్షకి అవకాశాలు క్యూ కట్టడం ఖాయమని చిత్రవర్గాలు పేర్కొంటున్నాయి. సంక్రాంతి కానుకగా రానున్న 'డిక్టేటర్'కి శ్రీవాస్ దర్శకుడు. అంజలి, సోనాల్ చౌహాన్ లీడ్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com