బాల‌కృష్ణతో అక్ష కామెడీ చేస్తోందా?

  • IndiaGlitz, [Monday,November 02 2015]

'కందిరీగ' సినిమాలో తెలంగాణ పోరిగా అక్ష చేసిన సంద‌డి అంతా ఇంతా కాదు. మ‌ళ్లీ ఆ స్థాయి పాత్ర అక్ష‌ని వ‌రించ‌నేలేదు. అందుకే రేసులో చాలా అంటే చాలా వెనుక‌బ‌డిందీ అమ్మ‌డు. క‌ట్ చేస్తే.. ఇప్పుడు 'కందిరీగ' స్థాయిలో కామెడీని పండించే అవ‌కాశం 'డిక్టేట‌ర్‌'లో ద‌క్కించుకుంద‌ని ఇన్‌సైడ్ సోర్స్ చెప్పుకొస్తోంది.

ఈ సినిమా కోసం బాల‌కృష్ణతో క‌లిసి అక్ష చేసే కామెడీ సినిమాకే హైలెట్‌గా నిలుస్తుంద‌ట‌. ఈ సినిమా త‌రువాత‌ అక్షకి అవ‌కాశాలు క్యూ క‌ట్ట‌డం ఖాయ‌మ‌ని చిత్ర‌వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. సంక్రాంతి కానుక‌గా రానున్న 'డిక్టేట‌ర్‌'కి శ్రీ‌వాస్ ద‌ర్శ‌కుడు. అంజ‌లి, సోనాల్ చౌహాన్ లీడ్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు.

More News

నాడు 'ఢ‌మ‌రుకం'.. నేడు 'అఖిల్‌'..

నాగార్జున‌, అనుష్క జంట‌గా న‌టించిన 'ఢ‌మ‌రుకం' సినిమా గుర్తుందిగా.. మూడేళ్ల క్రితం విడుద‌లైన ఈ సోషియో ఫాంట‌సీ.. బాక్సాఫీస్ వ‌ద్ద మిశ్ర‌మ ఫ‌లితం పొందింది.

సంప‌త్ నంది.. న‌వంబ‌ర్ సెంటిమెంట్‌

5 ఏళ్లు.. 3 సినిమాలు.. ఇదీ సంప‌త్ నంది ద‌ర్శ‌క‌ప్ర‌స్థానం. 'ఏమైందీ వేళ‌', 'ర‌చ్చ' వంటి విజ‌యవంత‌మైన సినిమాల త‌రువాత సంప‌త్ రూపొందించిన చిత్రం 'బెంగాల్ టైగ‌ర్‌'.

అజిత్ తెలుగు టైటిల్ ఫిక్సయింది...

తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్,శృతిహాసన్ హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న తమిళ చిత్రం ‘వేదాళం’.ఈ చిత్రాన్ని తెలుగులో ‘అవేశం’అనే పేరుతో విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

'సైజ్ జీరో' ఆడియో విడుదల

అనుష్క,ఆర్య ప్రధాన పాత్రధారులుగా ప్రముఖ నిర్మాణ సంస్థ పివిపి బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న చిత్రం‘సైజ్ జీరో’. ప్రకాష్ కోవెమూడి దర్శకుడు.

ఆ వార్తల్లో నిజం లేదంటున్న సీతాదేవి...

సూపర్ స్టార్ మహేష్ హీరోగా ఎ.ఆర్.మురగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా ఉంటుందని ఏప్రిల్ 12న సినిమా లాంఛనంగా ప్రారంభం అవుతుందని వార్తలు వినిపించాయి.