బాలయ్య 'అఖండ' పోస్టర్: మెలితిరిగిన మీసం.. రాజసం ఉట్టిపడే నడక

  • IndiaGlitz, [Wednesday,June 09 2021]

నందమూరి బాలకృష్ణ బర్త్ డే సెలబ్రేషన్స్ కాస్త ముందుగానే ప్రారంభం అయ్యాయి. బాలయ్య రేపటితో అంటే జూన్ 10న 61వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. బాలయ్య జన్మదినం సందర్భంగా 'అఖండ' చిత్ర యూనిట్ నేడు కొత్త పోస్టర్ లాంచ్ చేసింది.

ఇదీ చదవండి: కిస్ సీన్ లో నటిస్తే అలాగే ఫీల్ కావాలి.. హీరోయిన్ కామెంట్స్

ఈ పోస్టర్ లో బాలయ్య రాజసం ఉట్టిపడేలా యమ దర్జాగా కనిపిస్తున్నాడు. మెలితిరిగిన మీసం, పెదవులపై చిరునవ్వు, వాకింగ్ స్టైల్ అదరహో అనిపించేలా ఉన్నాయి. బాలయ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ చిత్ర యూనిట్ ఈ పోస్టర్ రిలీజ్ చేసింది.

పోస్టర్ రిలీజ్ అయిన వెంటనే అభిమానులు సోషల్ మీడియాలో ట్రెండింగ్ మొదలు పెట్టారు. బాలయ్య, బోయపాటి కాంబినేషన్ అంటే అభిమానులకు పండగే. సింహా, లెజెండ్ చిత్రాలు ఏ స్థాయి విజయం సాధించాయో అందరికీ తెలిసిందే.

ఈ చిత్రంలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ సంగీత దర్శకుడు. ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తన పుట్టినరోజు నాడు తనని కలుసుకునేందుకు రావద్దని, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అభిమానులంతా ఇంట్లోనే ఉండాలని బాలయ్య ఇటీవల ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. బాలయ్య బర్త్ డే కానుకగా తదుపరి చిత్రాలకు కూడా ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి.

More News

గాంధీ ముని మనవరాలికి 7 ఏళ్ల జైలు శిక్ష.. రూ.3 కోట్ల చీటింగ్ చేసి.. 

జాతిపిత మహాత్మా గాంధీ మునిమనవరాలు ఆశిష్ లతా రాంగోబిన్ కు దక్షిణాఫ్రికాలోని డర్బన్ న్యాయస్థానం ఏడేళ్ల జైలు శిక్ష విధించింది.

కిస్ సీన్ లో నటిస్తే అలాగే ఫీల్ కావాలి.. హీరోయిన్ కామెంట్స్

బాలీవుడ్ లో బ్యాడ్ లక్ వెంటాడిన హీరోయిన్లలో పరిణీతి చోప్రా ఒకరు. అందం, అభినయం ఉన్నప్పటికీ ఆమెకు అదృష్టం కలసి రాలేదు.

అషురెడ్డికి ముద్దిచ్చిన రాహుల్.. లవ్ అనౌన్స్మెంట్!

ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ బిగ్ బాస్ సీజన్ 3 విజేతగా నిలిచాడు. ఆ సీజన్ లో శ్రీముఖి, రాహుల్ పోటాపోటీగా తలపడ్డారు.

ఒకే కాన్పులో 10 మంది పిల్లలు.. రికార్డు సృష్టించిన మహిళ!

ఇలాంటి అద్భుతాలు అరుదుగా జరుగుతుంటాయి. ఎవరికైనా కవల పిల్లలు పుడితేనే ఆశర్యపోతుంటాం.

PSPK28: అలెర్ట్ అయిన టీమ్.. స్వయంగా క్లారిటీ ఇచ్చిన హరీష్ శంకర్

వకీల్ సాబ్ చిత్రంతో పవర్ స్టార్ సిల్వర్ స్క్రీన్ రీ ఎంట్రీ ఘనంగా జరిగింది. మునుపటిలాగే పవన్ వకీల్ సాబ్ లో పవర్ ఫుల్ గా కనిపించాడు.