ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై బాలయ్య ఏమన్నారంటే..?
Send us your feedback to audioarticles@vaarta.com
అగ్ర కథానాయకుడు, ఎం.ఎల్.ఎ నందమూరి బాలకృష్ణ సినీ ఇండస్ట్రీలోని కొన్ని విషయాల గురించి రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ మళ్లీ తెలుగు దేశం పార్టీ తరపున పూర్తి స్థాయి రాజకీయాల్లోకి రావాలని పలువురు కోరుకుంటున్నారంటూ.. దీనిపై మీ అభిప్రాయమేంటి? అని అడిగితే బాలయ్య మాట్లాడుతూ ‘‘వారి వారి డేడికేషన్ మీద ఆధారపడి ఉంటుంది. అదీగాక మీరు ఫుల్ టైమ్ పొలిటిక్స్ అంటున్నారు. తనకు సినిమా యాక్టర్‌గా చాలా భవిష్యత్తు ఉంది. మరి వాడిష్టం. ప్రొఫెషన్ వదులుకుని రమ్మనలేముగా. ఇప్పుడు నేనున్నాను ఎం.ఎల్.ఎగా ఉన్నాను, సినిమాల్లోనూ యాక్ట్ చేస్తున్నాను. నాన్నగారు కూడా సీఎంగా ఉన్నప్పుడు బ్రహ్మర్షి విశ్వామిత్ర వంటి సినిమా చేశారు. కాబట్టి వారి వారి ఇష్టాలపై ఆధారపడి ఉంటుంది’’ అన్నారు.
ప్రస్తుతం బాలకృష్ణ తన 106వ సినిమాలో నటిస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఓ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తయ్యింది. తదుపరి షెడ్యూల్‌ను స్టార్ చేయడానికి ఎదురు చూస్తున్నారు. కరోనా ప్రభావంతో ఆగిన షూటింగ్స్‌ను స్టార్ట్ చేసుకోమని ప్రభుత్వం ఓకే చెబితే ఈ సినిమా షూటింగ్‌ను స్టార్ట్ చేస్తారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com