చిరంజీవితోనే ఎక్కువగా కలుస్తా: బాలయ్య
- IndiaGlitz, [Wednesday,January 18 2017]
అభిమానులు చూసినా, చెప్పినా అర్థం చేసుకోరు. అమితాభిమానం అలా చేస్తుంటుందేమోననుకోవాలి. ఎందుకంటే ఈ సంక్రాంతి బరిలోకి మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నంబర్ 150, నటసింహ నందమూరి బాలకృష్ణ గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాలు విడుదలయ్యాయి. సినిమా విడుదల తర్వాత వీరాభిమానులు ఒకరి హీరోను మరొకరు విమర్శించుకోవడం మొదలు పెట్టారు.
సోషల్ మీడియా ప్రభావం ఎక్కువ కావడంతో ఈ విమర్శలు, ఒకరినొకరు తిట్టుకోవడం ఎక్కువైందనే చెప్పాలి. అయితే హీరోలు మాత్రం తాము కలిసే ఉన్నామంటారు. రీసెంట్గా గౌతమిపుత్ర శాతకర్ణి సక్సెస్ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ తాను హీరోల్లో ఎక్కువగా కలిసేది చిరంజీవితోనేనని, ఈ సంక్రాంతికి విడుదలైన సినిమాల్లో నా సినిమా, చిరంజీవిగారి సినిమా రెండూ సక్సెస్ కావడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పుకొచ్చారు. ..దటీజ్ బాలయ్య...