బాలయ్య .. భారీ పార్టీ
Send us your feedback to audioarticles@vaarta.com
జూన్ 10 నందమూరి అభిమానులకు మరచిపోలేని రోజు. ఎందుకనో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు. ఈసారి ఈ వేడుక అభిమానులకు, బాలయ్య మరింత ప్రత్యేకంగా కానుంది. ఎందుకంటే ఇది బాలకృష్ణకు 60వ పుట్టినరోజు. ఈ షష్టి పుర్తిన బాలకృష్ణ భారీగా నిర్వహించాలని అనుకుంటున్నాడట. తన ఇంట్లో సన్నిహితులకు ప్రత్యేకమైన విందును బాలకృష్ణ ఏర్పాటు చేశారట. మరి ఈ వేడుకలకు బాలకృష్ణ ఎవరిని ఆహ్వానిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. భారీ పూజను కూడా చేయాలని బాలయ్య అనుకుంటున్నాడట. మరి ఈ లాక్‌డౌన్ సమయంలో ప్రభుత్వం ఫంక్షన్స్‌కు వచ్చే అతిథులను పరిమితం చేసేసింది. 20 మందికి మించి ఫంక్షన్స్‌లో పాల్గొన కూడదని ఆర్డర్స్ ఉన్న నేపథ్యంలో బాలయ్య ఎలా షష్టి పూర్తి కార్యక్రమాన్ని నిర్వహిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
సినిమాల విషయానికి వస్తే బాలయ్య తన 106వ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి ‘మోనార్క్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. లాక్‌డౌన్ తర్వాత షూటింగ్స్ ప్రారంభం కాగానే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. సింహా, లెజెండ్ చిత్రాల తర్వాత బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో వస్తోన్న హ్యాట్రిక్ మూవీ ఇది. ఇందులో బాలకృష్ణ అఘోరా పాత్రలో కనిపించనుండటం విశేషం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com