బాలయ్య 106లో .. హీరోయిన్ ఛేంజ్
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి బాలకృష్ణ సినిమా అంటే దర్శక నిర్మాతలకు పెద్ద ఛాలెంజ్, ఆయనకు సరైన జోడీని ఫిక్స్ చేయడమే. టాలీవుడ్ సీనియర్ హీరోలకు తగ్గ హీరోయిన్ దొరకడం లేదనే వార్తలను మనం వింటూనే ఉన్నాం. ఈ కోవలో హీరోయిన్ సెట్ కావడానికి బాలయ్య కూడా సమయం పడుతూనే ఉంది. ఇప్పుడు బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో మూడో సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. లాక్డౌన్ తర్వాత సినిమా ఇటీవల పునః ప్రారంభమైంది. ఈ సినిమాలో హీరోయిన్ ఎట్టకేలకు క్లారిటీ వచ్చిందని అందరూ అనుకుంటే .. ఉన్నట్లుండి మార్పు జరిగింది. వివరాల్లోకెళ్తే ఎన్బీకే 106లో హీరోయిన్గా సయేషా సైగల్‌ను అనుకున్నారు. అయితే చివరి నిమిషంలో హీరోయిన్ మారిందట. సయేషా స్థానంలో ప్రగ్యా జైశ్వాల్ చేరిందని సమాచారం. ఆమె షూటింగ్లో పాల్గొందని వార్తలు వినిపిస్తున్నాయి.
సింహా, లెజెండ్ చిత్రాల తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తోన్న చిత్రం కావడంత సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే ఓ షెడ్యూల్ షూటింగ్ పూర్తయ్యింది. ఇప్పుడు రెండో షెడ్యూల్ జరుగుతోంది. ఇందులో బాలకృష్ణ డ్యూయెల్ రోల్ చేస్తున్నాడు. అందులో ఓ పాత్ర అఘోరా అని తెలిసిందే. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments