బాలయ్య 105 మూవీ టైటిల్
- IndiaGlitz, [Tuesday,June 11 2019]
నందమూరి బాలకృష్ణ 105వ సినిమాపై గత కొన్నిరోజులుగా చాలా వార్తలు వినిపిస్తూ వచ్చాయి. ముందుంగా బాలయ్య తన 105వ సినిమాను బోయపాటి శ్రీనుతో చేయాలనుకున్నాడు. తర్వాత కె.ఎస్.రవికుమార్ లైన్లోకి వచ్చాడు. అంతా ఓకే అని అనుకున్న సమయంలో సినిమా కథను కాస్త మార్చాల్సి వచ్చింది. అయితే ఈలోపు బాలయ్య, కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్లో సినిమా ఆగిపోయిందంటూ వార్తలు వినిపించాయి.
కానీ బాలకృష్ణ పుట్టినరోజు(జూన్ 10) సందర్భంగా బాలకృష్ణ, కె.ఎస్.రవికుమార్, సి.కల్యాణ్ కాంబినేషన్లో సినిమా ఉంటుందని యాడ్ రూపంలో ప్రకటన వచ్చింది. అయితే ఈ సినిమా ఎప్పటి నుండి ప్రారంభం అవుతుందనే దానిపై క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. కాగా.. సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రానికి 'క్రాంతి' అనే టైటిల్ పరిశీలనలో ఉందట. బాలయ్య తదుపరి సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఎప్పుడు గుడ్ న్యూస్ చెబుతారో వేచి చూద్దాం.