క్లైమాక్స్ చిత్రీకరణ పూర్తి చేసుకొన్న బాలకృష్ణ 102వ చిత్రం !!

  • IndiaGlitz, [Monday,October 16 2017]

నటసింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ సి.కె.ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రానికి కె.ఎస్.రవికుమార్ దర్శకుడు. బాలయ్య 102వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా క్లైమాక్స్ ఎపిసోడ్ నిన్నటితో ముగుసింది. అరివుమణి-అంబుమణిల సారధ్యంలో ఓ భారీ ఫైట్ సీక్వెన్స్ లు బాలయ్యపై చిత్రీకరించారు. ఈ యాక్ష‌న్ ఎపిసోడ్‌లో నంద‌మూరి బాల‌కృష్ణ‌, న‌యన‌తార‌, న‌టాషా, హరిప్రియ, ప్ర‌కాష్‌రాజ్‌, బ్ర‌హ్మానందం, ముర‌ళీ మోహ‌న్‌, జేపీ, ఎల్బీ శ్రీ‌రామ్‌ల‌తో పాటు ఇత‌ర‌ ప్ర‌ధాన తారాగ‌ణం కూడా పాలుపంచుకొంది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ.. "అక్టోబర్ 5న మొదలైన క్లైమాక్స్ ఎపిసోడ్ అక్టోబర్ 15 వరకూ నిరాటంకంగా షూట్ చేయడం జరిగింది. అరివుమణి-అంబుమణిలు అత్యంత నేర్పుతో సహజంగా ఉండేలా ఈ పోరాట సన్నివేశాలని డిజైన్ చేశారు. మూసాపేట్ లోని కంటైనర్ యార్డ్ లో ఈ కీలకమైన ఎపిసోడ్ ను షూట్ చేశాం. ఇప్పటికే నయనతార, నాటాషా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో హరిప్రియ మరో కథానాయికగా కనిపించనుంది" అన్నారు.

బాలకృష్ణ, నయనతార, న‌టాషా దోషీ, హరిప్రియ, ప్రకాష్ రాజ్, మురళీమోహన్, బ్రహ్మానందం, జ‌య‌ప్ర‌కాష్ రెడ్డి, ప్రభాకర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ-మాటలు: ఎం.రత్నం, కళ: నారాయణ రెడ్డి, పోరాటాలు: అరివుమణి-అంబుమణి, సినిమాటోగ్రఫీ: రాంప్రసాద్, సంగీతం: చిరంతన్ భట్, సహ-నిర్మాత: సి.వి.రావు, ఎద్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: వరుణ్-తేజ, నిర్మాణం: సి.కె.ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి, దర్శకత్వం: కె.ఎస్.రవికుమార్!

More News

ఈ 27న ఇప్పట్లో రాముడిలా సీతలా ఎవరుంటారండీ బాబు

లక్ష్మి ప్రసాద్ ప్రొడక్షన్ లో శివ సాయి సమర్పణలో నిర్మాత ప్రశ్నాద్  తాతా నిర్మిస్తున్న చిత్రం ఇప్పట్లో రాముడిలా సీతలా ఎవరుంటారండీ బాబు. మహీదర్, ఇషితా, ప్రశాంత్, లలిత ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి వెంకటేష్ కె. దర్శకత్వం వహిస్తున్నారు.

'కృష్ణారావ్ సూప‌ర్ మార్కెట్‌' షూటింగ్ ప్రారంభం!

ప్ర‌ముఖ క‌మెడియ‌న్ గౌతంరాజు త‌న‌యుడు కృష్ణ హీరోగా బిజేఆర్ స‌మ‌ర్ప‌ణ‌లో బిజిఆర్ ఫిలిం అండ్ టీవీ స్టూడియోస్ నిర్మిస్తోన్న చిత్రం 'కృష్ణారావ్ సూప‌ర్ మార్కెట్‌'. శ్రీనాథ్ పుల‌కురం ద‌ర్శ‌కుడుగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. ఎల్సా ఘోష్ హీరోయిన్ గా న‌టిస్తోంది.

14 ఏళ్ల త‌రువాత నాగ్‌..

కింగ్ నాగార్జున, సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మది సెన్సేష‌న‌ల్ కాంబినేష‌న్ అన్న సంగ‌తి తెలిసిందే. వీరి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన తొలి చిత్రం శివ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ మాత్ర‌మే కాదు ట్రెండ్ సెట్ట‌ర్ కూడా.

బ‌న్నీతో రెహ‌మాన్‌?

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం నా పేరు సూర్య అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ర‌చ‌యిత వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్న ఈ చిత్రంలో కేర‌ళ‌కుట్టి అను ఇమ్మానియేల్ హీరోయిన్‌గా న‌టిస్తుంది.

శర్వాతో షాలిని?

అర్జున్ రెడ్డితో తెలుగు తెరకు పరిచయమైన ఉత్తరాది భామషాలిని పాండే. ప్రీతి పాత్రలో క్యూట్ గా కనిపించి ఆకట్టుకోవడమే కాకుండా.. తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకుని మరీ మెప్పించింది.