నందమూరి బాలకృష్ణ 101వ చిత్రం ప్రారంభం
Send us your feedback to audioarticles@vaarta.com
బాలకృష్ణ, పూరి జగన్నాథ్ అంటేనే క్రేజీ కాంబినేషన్. హీరోయిజంను డిఫరెంట్ స్టయిల్‌లో ప్రెజెంట్ చేసే దర్శకుడు పూరి, వంద చిత్రాలతో తెలుగు సినిమా రంగంలో తండ్రికి తగ్గ తనయుడుగా రాణిస్తున్న నటసింహ నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో సినిమా గురువారం ఉదయం ప్రారంభమైంది.
నందమూరి బాలకృష్ణ నటిస్తున్ 101వ సినిమా పూజా కార్యక్రమాలు హైదరాబాద్ కూకట్‌పల్లి తులసీవనంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగాయి. డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై వి.ఆనంద్ ప్రసాద్ నిర్మాతగా సినిమా రూపొందుతుంది. ఈ సినిమా ప్రాంభోత్సవ కార్యక్రమంలో తొలి సన్నివేశానికి ఎస్.ఎస్.రాజమౌళి క్లాప్ కొట్టగా, నందమూరి రామకృష్ణ కెమెరా స్విచ్చాన్ చేశారు. తొలి సన్నివేశానికి బోయపాటి శ్రీను గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా...
క్రేజీ కాంబినేషన్
నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ - ``ఆధ్యాత్మిక చింతన ఉన్న వి.ఆనంద్ ప్రసాద్‌గారి నిర్మాణంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. అందరూ నా 101వ సినిమా ఏదై ఉంటుందని ఎదురుచూస్తున్న తరుణంలో ఈ క్రేజీ కాంబినేషన్‌లో సినిమా రూపొందుతోంది. అభిమానులు, ప్రేక్షకులు కోరుకునేలా సినిమా ఉంటుంది. త్వరలోనే మిగతా ఆర్టిస్టులు, టెక్నిషియన్స్ వివరాలు తెలియజేస్తాం``అన్నారు.
మా బ్యానర్‌కు క్రేజీ ప్రాజెక్ట్ ఈ చిత్రం
వి.ఆనంద్ ప్రసాద్ మాట్లాడుతూ - ``మా బ్యానర్‌లో ప్రొడక్షన్ నెం.8గా నందమూరి బాలకృష్ణగారు హీరోగా, పూరిగారి దర్శకత్వంలో సినిమా చేయడం ఎంతో హ్యాపీగా ఉంది. మా బ్యానర్‌కు క్రేజీ ప్రాజెక్ట్ అవుతుంది. ఈ నెల 16 నుండి ఏకధాటిగా షూటింగ్ చేస్తాం. సెప్టెంబర్ 29న సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. పూజా కార్యక్రమాలు జరుపుకోవడానికి ముందుగానే విడుదల తేదీని ప్రకటించడం మంచి పరిణామమని అందరూ అంటున్నారు`` అన్నారు.
బాలకృష్ణగారితో సినిమా చేయాలనే లక్ష్యం నేరవేరుతోంది.
పూరి జగన్నాథ్ మాట్లాడుతూ - ``ఎన్నాళ్ళుగానో వెయిట్ చేస్తున్న సమయమిది. ఎప్పటి నుండో బాలకృష్ణగారితో ఎప్పటి నుండో సినిమా చేయాలనే లక్ష్యం ఈ సినిమాతో నేరవేరింది. అభిమానులు బాలకృష్ణగారి నుండి ఏ ఎలిమెంట్స్‌ను ఆశిస్తారో, అలా ఆయన బాడీ లాంగ్వేజ్, లుక్ ఉంటుంది. అనుకున్న డేట్ కన్నా ఒకట్రెండు రోజుల ముందే సినిమాను విడుదల చేయడానికి సిద్ధంగానే ఉంటాం`` అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments