బాలయ్య వందో సినిమా టైటిల్ ఇదే..
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి నట సింహాం బాలక్రిష్ణ ప్రస్తుతం 99వ చిత్రం డిక్టేటర్ లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీవాస్ తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న డిక్టేటర్ మూవీని సంక్రాంతి కానుక గా జనవరి 14న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే..బాలయ్య వందో చిత్రాన్ని బోయపాటి శ్రీను తెరకెక్కించనున్నట్టు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతుంది. బాలయ్య, బోయపాటి కాంబినేషన్లో సింహా, లెజెండ్ చిత్రాలు రూపొందాయి.
ఈ రెండు చిత్రాలు ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసాయో తెలిసిందే. బాలయ్యతో బోయపాటి తీసే హ్యాట్రిక్ ఫిల్మ్ అండ్ బాలయ్య వందో చిత్రాన్నిఅద్భుతంగా ఉండేలా పవర్ ఫుల్ స్టోరి రెడీ చేస్తున్నాడట. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉండే ఈ చిత్రానికి గాడ్ ఫాదర్ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్టు సమాచారం. బాలయ్య కెరీర్ లో ఎప్పటికీ మరువలేని ఈ చిత్రాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారు..? ఎవరు నిర్మిస్తారు..? గాడ్ పాధర్ టైటిల్ ఫిక్స్ చేసారా..? తదితర వివరాలు తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments