బాలయ్య వందో సినిమా లేటెస్ట్ న్యూస్...
Tuesday, March 1, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి నట సింహం బాలకృష్ణ వందో సినిమా డైరెక్టర్ ఎవరు అనే విషయం పై గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నవిషయం తెలిసిందే.అయితే క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీకి బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ప్రస్తుతం కృష్ణవంశీ ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రారంభించారు. ఇటీవల బాలయ్యను కృష్ణవంశీ లేపాక్షి ఉత్సవాల్లో కూడా కలసి ఈ సినిమా గురించి చర్చించారట.
ఇక ఈ సినిమాకి సంబంధించి లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే....ఈ క్రేజీ మూవీలో నందమూరి హీరో తారకరత్న ఓ పాత్ర పోషిస్తున్నాడట. అలాగే నారా వారి హీరో నారా రోహిత్ కూడా ఓ పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం. అలాగే బాలయ్య వందో సినిమాలో బాలయ్య వారసుడు మోక్షజ్న నటిస్తాడని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది. సో...మోక్షజ్న కూడా ఈ చిత్రంలో నటించవచ్చు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందే ఈ చిత్రం గురించి పూర్తి వివరాలను త్వరలో అఫిషియల్ గా ఎనౌన్స్ చేయనున్నట్టు సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments