బిగ్‌బాస్ మరో షాక్... బాలాదిత్య ఎలిమినేషన్, హౌస్‌మెట్స్‌కి ఏం చెప్పాడంటే..?
Send us your feedback to audioarticles@vaarta.com
గడిచిన రెండు వారాలుగా బిగ్‌బాస్ కంటెస్టెంట్స్‌కి షాకిస్తున్నాడు. ఎవ్వరూ ఊహించని విధంగా ఆర్జే సూర్యను బట్టలు సర్దుకోమన్న బిగ్‌బాస్.. తర్వాత వారం గలాటా గీతూను బయటికి తరిమేశాడు. దీంతో ఈ వారం కూడా ఎవరో ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్‌కి మూడుతుందని అంతా భావించారు. దీనికి తగ్గట్లుగానే స్కెచ్ గీశాడు బిగ్‌బాస్ . ఈసారి ఇంటికి పెద్దన్నగా వుంటూ వస్తున్న బాలాదిత్యను ఔట్ అన్నాడు. వచ్చి రావడంతోనే డాక్టర్ - పేషెంట్ గేమ్ ఆడించి అంతా హుషారుగా వున్న సమయంలో బాలాదిత్యను ఎలిమినేట్ చేస్తున్నట్లు ప్రకటించడంతో అంతా షాకయ్యారు. ఇంతకుముందు నామినేషన్స్‌లో వున్న ఒక్కొక్కరిని సేవ్ చేసుకుంటూ వచ్చి ఫైనల్‌గా ఒకరిని ఎలిమినేట్ చేసేవారు. కానీ ఈసారి మాత్రం రావడం రావడంతోనే ఎలిమినేట్ చేసే పద్ధతికి తెరదీశారు.
బాలాదిత్యను ఎలిమినేట్ అవుతున్నట్లు నాగార్జు ప్రకటించగానే ఇంటి సభ్యులు షాక్ అయ్యారు. కానీ తొలి నుంచి చాలా మెచ్యూర్డ్ పర్సన్‌గా మెలిగిన బాలాదిత్య మాత్రం బాధ బయటికి కనిపించకుండా ఏడుపులు, ఓవరాచాక్షన్ లాంటివి చేయకుండా చాలా సింపుల్‌గా స్టేజ్ మీదకు వచ్చేశాడు. గత వారం గీతూ లాగా ఈయన కూడా ఓవరాక్షన్ చేస్తాడేమోనని భయపడిన ప్రేక్షకులకు బాలాదిత్య డీసెంట్‌గా రావడం చాలా బాగా నచ్చింది.
అనంతరం నాగార్జున ఆయనకు స్టేజ్ పైన తన జర్నీ చూపించారు. ఈ సందర్భంగా ఇంటి సభ్యులు మార్చుకోవాల్సిన విషయాల గురించి చెప్పాల్సిందిగా నాగ్ కోరారు. రాజ్‌లో కాన్ఫిడెన్స్ కనిపించడం లేదని.. రోహిత్‌ని టెంపర్ లూజ్ కావొద్దని సూచించాడు బాలాదిత్య. మెరీనా ఇండిపెండెంట్‌గా ఆడాలని, శ్రీసత్య, ఇనయాలు మాట తీరు మార్చుకోవాలని సలహా ఇచ్చాడు. శ్రీహాన్ చాలా తెలివైన వ్యక్తి అని ... కాబట్టి బ్యాలెన్స్డ్గా వుండమన్నాడు. రేవంత్ కోపాన్ని తగ్గించుకోవాలని.. ఆదిరెడ్డి గట్టిగా ఆరవకుండా కాన్ఫిడెంట్‌గా వుండాలని సూచించాడు. కీర్తి డైమండ్ అని... ఇతరుల గురించి ఆలోచించకుండా తన కోసం ఆట ఆడాలని బాలాదిత్య సలహా ఇచ్చాడు. ఫైమా స్ట్రాటజీలు వాడటం తప్పుకాదని.. కాకపోతే అవి ఫెయిరా, అన్ ఫెయిరా అన్నది చూసుకోవాలన్నాడు. వాసంతి చాలా చిన్న పిల్ల అని.. ఓడిపోతే తీవ్రంగా బాధపడిపోతుందని.. గ్లామరే కాకుండా గ్రామర్ కూడా బాగుండాలని సూచిస్తూ అందరికీ గుడ్‌బై చెప్పాడు.
మొత్తంగా కంటెస్టెంట్స్‌లో వివాదరహితుడిగా, ఎలాంటి మచ్చ లేకుండా బయటకు వచ్చాడు బాలాదిత్య. తొలుత పెద్దరికంతో మరో శివబాలాజీ అవుతాడనుకున్న దశలో .. రాను రాను ఆయన ఆటతీరు పేలవంగా సాగింది. టాస్కుల్లోనూ దమ్ము చూపించలేకపోయాడు. చాలా వరకు స్పీచ్‌లు ఇస్తూ.. అందరికి ఇది రైట్, ఇది రాంగ్ అని చెబుతూ రేలంగి మామయ్యలాగే కనిపించాడు. ఇక గత వారం సిగరెట్ల కోసం గీతూతో గొడవ పడ్డప్పటి నుంచి ఆయన ఓటింగ్ దిగజారిపోయిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అందుకే చెల్లి వెళ్లిన వారానికే అన్నయ్యని కూడా సాగనంపారు. మొత్తం మీద క్లీన్ ఇమేజ్‌తో బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టి.. అదే ఇమేజ్‌తో బయటకు వచ్చిన రేర్ కంటెస్టెంట్స్‌లో ఒకడిగా నిలిచాడు బాలాదిత్య.
ఇక.. రేపటి ఎపిసోడ్‌లోనూ ఎలిమినేషన్ వుంటుందనే సంకేతాలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. తొలుత మెరీనా అనే వార్తలు వచ్చినప్పటికీ చివరి నిమిషంలో వాసంతి ఆ ప్లేస్‌లోకి వచ్చినట్లుగా తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com