కెప్టెన్‌గా బాలాదిత్య... వరస్ట్ పర్ఫార్మర్‌గా గీతూ రాయల్ , ‘అతి’ కొంపముంచిందిగా
Send us your feedback to audioarticles@vaarta.com
నిన్నటి ఎపిసోడ్‌లో మేరీనా - రోహిత్‌ల గిల్లికజ్జాలు, తనను అందరూ కలిసి ఒంటిరివాడిని చేశారన్న రేవంత్ ఫ్రస్ట్రేషన్ చూశాం. అలాగే బిగ్‌బాస్ 6 తొలి వారం కెప్టెన్ ఎన్నికకు సంబంధించి మాస్ టీమ్ నుంచి మెరీనా - రోహిత్, ఆర్జే సూర్య, బాలాదిత్యలను ఎంపిక చేస్తారు. మరి వీరిలో ఎవరు తొలి వారం కెప్టెన్‌గా నిలిచారో తెలియాలంటూ ఈరోజు ఎపిసోడ్‌లోకి వెళ్లాల్సిందే.
కెప్టెన్సీ పోటీదారులకు బిగ్‌బాస్ ‘‘కెప్టెన్సీ’’ బండి అనే టాస్క్ ఇచ్చారు. గేమ్‌లో భాగంగా వాటర్‌లో వున్న తాళాలను .. అందులో తలముంచి నోటితో అందుకుని పక్కనే వున్న బాక్స్‌ని ఓపెన్ చేయాలి. ఆ తర్వాత బాక్స్‌లో వున్న కార్ నెంబర్‌ని, మరో టబ్‌లో వున్న నెంబర్స్ వెతికి తనకు కేటాయించిన కారు నెంబర్‌ని సరైన విధంగా అమర్చాలి. దీనికి ఫైమాను సంచాలక్‌గా నియమించారు బిగ్‌బాస్.
ఈ టాస్క్‌లో గీతా రాయల్ చాలా చురుగ్గా వ్యవహరిస్తూ.. అందరికంటే ముందే టాస్క్‌ని పూర్తి చేసింది. కానీ.. గీతూ గేమ్‌ని తప్పుగా ఆడిందని, అందువల్ల ఆమె విజేత కాదని తీర్పు చెప్పింది ఫైమా. దీంతో బాలాదిత్య విన్నర్‌గా నిలిచి.. బిగ్‌బాస్ 6 సీజన్ తొలి వారం కెప్టెన్‌గా అవతరించాడు. ఆ వెంటనే ఇంటి సభ్యులు ఆయనను తీసుకెళ్లి కెప్టెన్ సీట్లో కూర్చోబెట్టారు. నిజానికి అతను కెప్టెన్సీకి అర్హుడే. తన మెచ్యూర్డ్ ఆటతో అందరినీ ఆకట్టుకున్నాడు. అనవసరంగా ఆవేశాలకు పోకుండా.. తాను పద్ధతిగా వుంటూ, అందరికీ చెబుతూ ఇంటి పెద్దలా మారాడు.
ఈ తతంగం ముగిసిన వెంటనే వరస్ట్ పెర్ఫార్మర్ ఎవరో చెప్పాలని బిగ్‌బాస్.. కంటెస్టెంట్స్‌లను ఆదేశించాడు. దీంతో మరోమాట లేకుండా మెజారిటీ ఇంటి సభ్యులు గీతూ రాయల్‌ని టార్గెట్ చేశారు. తొలి వారమే ఆమె చేసిన ఓవరాక్షన్, యాటిడ్యూడ్‌ను భరించలేకపోయారు. అందుకే వరస్ట్ పెర్ఫార్మర్ స్టాప్ ఆమెకు గుద్దేయడంతో గీతూ ముఖం మొత్తం రెడ్ మార్కులతో నిండిపోయింది. దాదాపు 15 మంది కంటెస్టెంట్స్ గీతూ రాయల్‌కి వరస్ట్ పెర్ఫార్మర్ స్టాంప్ గుద్దడం విశేషం. ఆ వెంటనే గీతూ రాయల్‌ని జైలులో వేయమని చెప్పారు బిగ్‌బాస్.
అయితే మధ్యలో కలగజేసుకున్న కెప్టెన్ బాలాదిత్య... గీతూ రాయల్‌కు పీరియడ్స్ వుండటంతో ఈసారికి క్షమించాలని కోరాడు. కానీ బిగ్‌బాస్ నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో తప్పనిసరి పరిస్ధితుల్లో గీతూని జైల్లో వేశారు. జైల్లోకి వెళ్తూ.. వెళ్తూ.. ఇక్కడున్న వాళ్లంతా తన ఫ్యామిలీ కాదని, జస్ట్ వంద రోజుల పాటు వుండే కంటెస్టెంట్స్ మాత్రమేనని కామెంట్ చేసింది .అంతేకాదు.. ఇక్కడ తన కన్న తల్లిదండ్రులే వున్నా వాళ్లను ఓడించి గెలుస్తానని గీతూ రాయల్ తేల్చిచెప్పింది.
ఈ తతంగం మధ్యలో శ్రీహాన్ - ఇనయాల మధ్య జరిగిన డైలాగ్ వార్ హౌస్‌ను కాసేపు వేడెక్కించింది. శ్రీహాన్ ఎఫైర్స్ బయటపెడుతూ.. నీకు సిరి మాత్రమే కాదు, ఇంకా ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ వున్నారంటూ ఆమె ప్రశ్నించింది. దీనికి అదే స్థాయిలో వార్నింగ్ ఇచ్చినప్పటికీ.. సిరి ప్రస్తావన తీసుకురావడంతో కంటతడి పెట్టుకున్నాడు. రేపు శనివారం కావడంతో హోస్ట్ నాగార్జున ఎంట్రీ ఇవ్వనున్నారు. దీంతో ఆయన ఎవరెవరికి క్లాస్ పీకుతాడా అని ప్రేక్షకుల్లో ఉత్కంఠ నెలకొంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments