ప్రముఖ దర్శకుడు బాల సమర్పణ లో 'కాళి'

  • IndiaGlitz, [Monday,November 28 2016]

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు బాల త‌మిళంలో నిర్మించిన 'చండివీర‌న్‌' తెలుగులో 'కాళి' అనే పేరుతో అనువాద‌మ‌వుతోంది. బి స్టూడియోస్ ప‌తాకంపై ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు బాల తెలుగులో స‌మ‌ర్పిస్తున్నారు. అధర్వ‌, ఆనంది, లాల్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. శ‌ర్కున‌మ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌ర మూవీస్‌, శ్రీ గ్రీన్ ప్రొడ‌క్ష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఎం.ఎం.ఆర్‌. ఈ చిత్రాన్ని తెలుగులో అందిస్తున్నారు.
నిర్మాత ఎం.ఎం.ఆర్ మాట్లాడుతూ ''ఫ‌క్తు ప‌ల్లెటూరి చిత్ర‌మిది. నీటి కోసం రెండు ఊర్ల మ‌ధ్య జ‌రిగిన పోరాటం ఇందులో ఉంటుంది. సంక్రాంతి సంబ‌రాల నుంచి, ప‌ల్లెటూరి స‌ర‌సాలు, స‌ర‌దాల వ‌ర‌కు అన్నీ ఇందులో ఉన్నాయి. తొలి స‌గం ఆద్యంతం క‌డుపుబ్బ న‌వ్విస్తుంది. రెండో స‌గం ఉత్కంఠ‌భ‌రితంగా సాగుతుంది. స‌న్నివేశాల మూడ్‌కు అనుగుణంగా సాగే పి.జి.ముత్త‌య్య కెమెరా ప‌నిత‌నం మెప్పిస్తుంది. సామాజిక స్పృహ‌తో సాగే చిత్ర‌మిది. అనువాద ప‌నులు దాదాపు పూర్త‌య్యాయి. అరుణ‌గిరి అందించిన బాణీలు త‌ప్ప‌కుండా అంద‌రికీ న‌చ్చుతాయి. స‌బేష్ - ముర‌ళి నేప‌థ్య సంగీతం సినిమాను మ‌రో స్థాయికి తీసుకెళ్తుంది. అధర్వ‌, ఆనంది మ‌ధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఈ స్క్రిప్ట్ న‌చ్చి త‌మిళంలో ఈ చిత్రాన్ని బాల నిర్మించారు.
తెలుగులో ఆయ‌న స‌మ‌ర్ప‌కులుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. తెలుగు వారికి కూడా త‌ప్ప‌కుండా క‌నెక్ట్ అయ్యే సినిమా ఇది. డిసెంబ‌ర్ లో పాట‌ల‌ను, చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తాం'' అని అన్నారు. రాజ‌శ్రీ, బోస్ వెంక‌ట్‌, ఎన్. ఎలాంప‌ర్తి, ర‌విచంద్ర‌న్‌, శాంత‌కుమారి, కె.అనంత‌న్‌, అనంత పంగాలి, క‌లై, మ‌దురై ర‌మేవ్‌, జి.కె కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన ఈ చిత్రానికి కెమెరా: పి.జి.ముత్త‌య్య‌, సంగీతం: ఎస్‌.ఎన్‌.అరుణ‌గిరి, నేప‌థ్య సంగీతం: స‌బేష్ ముర‌ళి, మాట‌లు: ఎం.రాజ‌శేఖ‌ర్ రెడ్డి, పాట‌లు: భువ‌న‌చంద్ర‌, శివ‌గ‌ణేశ్‌, డా.చ‌ల్లా భాగ్య‌ల‌క్ష్మి, ఆర్ట్: ఎ.ఆర్. మోహ‌న్‌, ఎడిటింగ్‌: ఎ.రాజా మొహ‌మ్మ‌ద్‌, క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: ఎ.శర్కున‌మ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత‌: ర‌ఘు, నిర్మాత‌: ఎం.ఎం.ఆర్‌.

More News

'రెమో' చిత్రాన్ని పెద్ద సక్సెస్ చేసిన తెలుగు ప్రేక్షకులకు థాంక్స్ - దిల్ రాజు

24 ఎ.ఎం.స్టూడియోస్ బ్యానర్పై ఆర్.డి.రాజా సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్రాజు తెలుగులో విడుదల చేసిన చిత్రం `రెమో`. శివకార్తీకేయన్, కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా భాగ్యరాజ్ కన్ననన్ దర్శకత్వంలో రూపొందిన లవ్ ఎంటర్టైనర్ నవంబర్ 24న రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ రిలీజ్ అయ్యింది.

వెంకటేష్ గురు షూటింగ్ పూర్తి..!

విక్ట‌రీ వెంక‌టేష్ న‌టిస్తున్న తాజా చిత్రం గురు. ఈ చిత్రం అవార్డ్ విన్నింగ్ త‌మిళ్ సూప‌ర్ హిట్ ఫిల్మ్ ఇరుదు సుత్త్ రు చిత్రం ఆధారంగా రూపొందుతుంది. ఈ చిత్రానికి సుధా కొంగ‌ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

అదేమిటో చెబితే అంద‌రికీ ఆశ్చ‌ర్య‌మే - త‌మ‌న్నా..!

మిల్కీబ్యూటీ త‌మ‌న్నా ఈ సంవ‌త్స‌రం ఊపిరి, అభినేత్రి చిత్రాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. స్పెష‌ల్ సాంగ్ లో కూడా కనిపించి క‌నువిందు చేసింది. ఇదిలా ఉంటే...ఈ సంవ‌త్స‌రం బాగానే గ‌డిచింది. ఇక వ‌చ్చే సంవ‌త్స‌రం చేసే సినిమాలు చెబితే అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోతారు అంటుంది మిల్కీబ్యూటీ త‌మ‌న్నా.

చైతు మూవీ గురించి నాగ్..!

ప్రేమమ్, సాహసం శ్వాసగా సాగిపో... ఈ రెండు చిత్రాలతో వరుస విజయాలు సాధించిన అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో నటిస్తున్నారు. అక్కినేని నాగార్జున నిర్మిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది.

గౌత‌మీపుత్రశాత‌క‌ర్ణి ఆడియో & ర‌న్ టైమ్ డీటైల్స్..!

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ న‌టిస్తున్న 100వ చిత్రం గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి. ఈ చిత్రాన్ని జాగ‌ర్ల‌మూడి క్రిష్ తెర‌కెక్కిస్తున్నారు. గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి విజయం సాధించాలి అని కోరుకుంటూ అభిమానులు ఫిల్మ్ న‌గ‌ర్ దైవ‌స‌న్నిధానంలో రుద్రాభిషేకం నిర్వ‌హించారు.