ప్రముఖ దర్శకుడు బాల సమర్పణ లో 'కాళి'

  • IndiaGlitz, [Monday,November 28 2016]

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు బాల త‌మిళంలో నిర్మించిన 'చండివీర‌న్‌' తెలుగులో 'కాళి' అనే పేరుతో అనువాద‌మ‌వుతోంది. బి స్టూడియోస్ ప‌తాకంపై ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు బాల తెలుగులో స‌మ‌ర్పిస్తున్నారు. అధర్వ‌, ఆనంది, లాల్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. శ‌ర్కున‌మ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌ర మూవీస్‌, శ్రీ గ్రీన్ ప్రొడ‌క్ష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఎం.ఎం.ఆర్‌. ఈ చిత్రాన్ని తెలుగులో అందిస్తున్నారు.
నిర్మాత ఎం.ఎం.ఆర్ మాట్లాడుతూ ''ఫ‌క్తు ప‌ల్లెటూరి చిత్ర‌మిది. నీటి కోసం రెండు ఊర్ల మ‌ధ్య జ‌రిగిన పోరాటం ఇందులో ఉంటుంది. సంక్రాంతి సంబ‌రాల నుంచి, ప‌ల్లెటూరి స‌ర‌సాలు, స‌ర‌దాల వ‌ర‌కు అన్నీ ఇందులో ఉన్నాయి. తొలి స‌గం ఆద్యంతం క‌డుపుబ్బ న‌వ్విస్తుంది. రెండో స‌గం ఉత్కంఠ‌భ‌రితంగా సాగుతుంది. స‌న్నివేశాల మూడ్‌కు అనుగుణంగా సాగే పి.జి.ముత్త‌య్య కెమెరా ప‌నిత‌నం మెప్పిస్తుంది. సామాజిక స్పృహ‌తో సాగే చిత్ర‌మిది. అనువాద ప‌నులు దాదాపు పూర్త‌య్యాయి. అరుణ‌గిరి అందించిన బాణీలు త‌ప్ప‌కుండా అంద‌రికీ న‌చ్చుతాయి. స‌బేష్ - ముర‌ళి నేప‌థ్య సంగీతం సినిమాను మ‌రో స్థాయికి తీసుకెళ్తుంది. అధర్వ‌, ఆనంది మ‌ధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఈ స్క్రిప్ట్ న‌చ్చి త‌మిళంలో ఈ చిత్రాన్ని బాల నిర్మించారు.
తెలుగులో ఆయ‌న స‌మ‌ర్ప‌కులుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. తెలుగు వారికి కూడా త‌ప్ప‌కుండా క‌నెక్ట్ అయ్యే సినిమా ఇది. డిసెంబ‌ర్ లో పాట‌ల‌ను, చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తాం'' అని అన్నారు. రాజ‌శ్రీ, బోస్ వెంక‌ట్‌, ఎన్. ఎలాంప‌ర్తి, ర‌విచంద్ర‌న్‌, శాంత‌కుమారి, కె.అనంత‌న్‌, అనంత పంగాలి, క‌లై, మ‌దురై ర‌మేవ్‌, జి.కె కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన ఈ చిత్రానికి కెమెరా: పి.జి.ముత్త‌య్య‌, సంగీతం: ఎస్‌.ఎన్‌.అరుణ‌గిరి, నేప‌థ్య సంగీతం: స‌బేష్ ముర‌ళి, మాట‌లు: ఎం.రాజ‌శేఖ‌ర్ రెడ్డి, పాట‌లు: భువ‌న‌చంద్ర‌, శివ‌గ‌ణేశ్‌, డా.చ‌ల్లా భాగ్య‌ల‌క్ష్మి, ఆర్ట్: ఎ.ఆర్. మోహ‌న్‌, ఎడిటింగ్‌: ఎ.రాజా మొహ‌మ్మ‌ద్‌, క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: ఎ.శర్కున‌మ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత‌: ర‌ఘు, నిర్మాత‌: ఎం.ఎం.ఆర్‌.

More News

Meera Jasmine's strong suggestion for sexual offenders

Meera Jasmine, who is busy doing Malayalam films has come out strongly against men who sexually assault women, suggesting that extreme punishment like castration is the only way of punishing them. She is of the opinion that then the men won't dare touch a woman again.

Jai's next with the producer of Mohanlal & Mammotty films

Suhail Shaik Madar and Hashim Marikar the CEO of Maikar Films and Marikar Arts which has produced around 20 films in Malayalam with veterans Mammootty, Mohanlal and others will be stepping into Kollywood soon.

Venkatesh's 'Guru' official updates

'Guru', the Telugu remake of 'Saala Khadoos' ('Irudhi Suttru' in Tamil), is all done with the shoot.  The film is written and directed by Sudha Kongara, the one who directed the original.  Currently in post-production stage, it's officially now in January end race.

Mammootty flaunts a salt and pepper look in his next flick

Malayalam film audience cherishes extraordinary expectations when it comes to a Ranjith movie, but extra hullabaloo is sure to be there when Mammootty teams up with the director...

Twitter satires about Shilpa Shetty's casual talk

Actress Shilpa Shetty has been trolled for telling a national daily that including books like "Lord of the Rings and Harry Potter as part of the school syllabus" is a great idea and that, on similar  lines, 'Animal Farm' and 'Little Women' could be included to teach children about animal-caring and respecting women.