ఆంధ్ర బ్యాంకును విలీనం చేయడం పై వైసీపీ నేతల ఆందోళన
Send us your feedback to audioarticles@vaarta.com
ఆర్థిక మాంద్యం అరికట్టేందుకు కేంద్రం తీసుకున్న ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీన నిర్ణయం తప్పు పడుతున్నారు నేతలు. ఆంధ్ర బ్యాంకు ను యూనియన్ బ్యాంక్ లో విలీనం చేయడం పై వైసీపీ నేతలు అభ్యంతకరం వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్ర బ్యాంకు విలీనం సరి కాదని ఎంపీ బాలశౌరి కేంద్రానికి లేఖ రాశారు. ఇది తెలుగు ప్రజల మనోభావాల్ని దెబ్బతీసేలా ఉందని... ఆ నిర్ణయాన్ని ఉపసంహరించు కోవాలని కోరారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయం పై పునరాలోచన చేయాలన్నారు. లేదంటే పరిస్థితులు తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నట్లు హెచ్చరించారు.
కాగా... ఆంధ్రా బ్యాంక్ తో పాటు కార్పొరేషన్ బ్యాంక్ ను కూడా యూబీఐ లో కలపనుంది కేంద్రం. ఇప్పటికే స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో కలిపిన విషయం తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout