తెలుగు, తమిళంలో 'బాజీరావ్ మస్తానీ'
Send us your feedback to audioarticles@vaarta.com
ఈరోస్ ఇంటర్నేషనల్, సంజయ్‌లీలా బన్నాలీ సంయుక్తంగా రూపొందించిన భారీ పీరియాడికల్ డ్రామా బాజీరావ్ మస్తానీ`. వరల్డ్‌వైడ్‌గా డిసెంబర్ 18న సినిమా విడుదలవుతుంది. హిందీతో పాటు తెలుగు, తమిళంలో కూడా సినిమాను గ్రాండ్ లెవల్లో నిర్మాతలు విడుదల చేస్తున్నారు. బాహుబలి, ఎందిరన్(రోబో) చిత్రాలకు వర్క్ చేసిన ప్రముఖ రచయిత మదన్ కర్కే ఈ సినిమాకు పాటలు, మాటలు రాశారు. అలాగే శ్రీమంతుడు, బాహబలి చిత్రాలకు వర్క్ చేసిన ప్రముఖ రచయిత రామజోగయ్యశాస్త్రి తెలుగులో పాటలను రాశారు. బాజీరావ్ మస్తానీ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీలో భారీ లెవల్లో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా...
ఈరోస్ ఇంటర్నేషనల్ మీడియా లి. సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నందు అహుజా మాట్లాడుతూ `దక్షిణాదిన పీరియాడికల్ డ్రామా చిత్రాలకు మంచి ఆదరణ ఉంటుందని తెలుసు. అందుకు బాజీరావ్ మస్తానీ చిత్రాన్ని తెలుగు, తమిళ్లో అనువాదం చేసి విడుదల చేస్తున్నాం. అద్భుతమైన కథ, ఎపిక్ డ్రామా ప్రేక్షకులను నచ్చుతుంది. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్ సోషల్ మీడియా హల్ చల్ చేసింది. బాజీరావ్ మస్తానీ వంటి గ్లోబెల్ మూవీని సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందని కచ్చితంగా చెప్పగలను`` అన్నారు.
సంజయ్ లీలా బన్సాలీ మాట్లాడుతూ `బాజీరావ్ మస్తానీ పీరియాడిక్ డ్రామా చిత్రాన్ని తెలుగు, తమిళంలో కూడా విడుదల చేస్తున్నామని చెప్పడానికి చాలా ఆనందంగా ఉంది. చాలా సంవత్సరాల కల ఈ సినిమా. ప్రేక్షకుంలందరికీ ఈ కల తప్పకుండా నచ్చుతుంది. తెలుగు, తమిళ ప్రేక్షకులు వారి భాషలోనే సినిమాను చూడబోతున్నారు`` అన్నారు.
పద్మశ్రీ అవార్డు గ్రహీత సంజయ్‌లీలా బన్సాలీ నుండి వస్తున్నమరో మాస్టర్ పీస్ మూవీ ఇది. రణవీర్ సింగ్, దీపికాపదుకొనే,ప్రియాంక చోప్రా వంటి టాప్ స్టార్స్ నటించిన ఈ చిత్రం డిసెంబర్ 18న వరల్డ్‌వైడ్‌గా విడుదల కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com