కళ్లు కనపడటం లేదంటే బెయిల్ వచ్చింది.. అది కూడా షరతులతో..

  • IndiaGlitz, [Tuesday,October 31 2023]

మొత్తానికి దాదాపు 52రోజుల తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబుకు బెయిలొచ్చింది. దశాబ్దాలుగా వ్యవస్థలను మ్యానేజ్ చేసుకుంటూ పబ్బం గడిపిన చంద్రబాబు ఇన్నాళ్లకు చట్టానికి చిక్కి, జైల్లో అర్థ శతదినోత్సవం జరుపుకున్నారు. అయితే అనారోగ్య సమస్యలు ఉన్నాయంటూ హైకోర్టును కోరడంతో షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ దక్కింది. తన కేసులు కొట్టేయాలి అంటూ వివిధ కోర్టుల ముందు పెట్టుకున్న అర్జీలు ఫలితాన్ని ఇవ్వలేదు. మరోవైపు అవమానభారం.. ఇంకోవైపు పనికిమాలిన కొడుకు పప్పుతో శిరోభారం. ప్రధానులను, రాష్ట్రపతులు, శాస్త్రవేత్తలను తయారుచేశాం అని చెప్పుకుంటూ పబ్బం గడిపిన ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబును ఈ అరెస్ట్ తీవ్రంగా కలవరపరిచింది.

ఇక ఇలా అయితే బయటికి వచ్చే అవకాశం లేదని గ్రహించిన చంద్రబాబు ఏకంగా టక్కుటమార విద్యలు మొదలుపెట్టారు. కళ్లు బాగా లేవని, చికిత్స అవసరం అని కోర్టుల ముందు వాపోయారు. దీంతో పోన్లే కళ్లు కూడా బాలేకపోతే ఎలా అంటూ కోర్టు సానుభూతి బెయిల్ ఇచ్చింది. ఇందులోనూ బోలెడు కండిషన్స్ పెట్టింది. స్కిల్ స్కాములో దాదాపు రూ. 374 కోట్లను దోచుకుని, పైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్, లిక్కర్ స్కాంలో కీలక సూత్రధారిగా ఉన్న చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ఆరోగ్య కారణాల రీత్యా మధ్యంతర బెయిల్ ఇచ్చింది. నవంబర్ 28న తిరిగి సరెండర్ అవ్వాలని ఆదేశించింది.

అరెస్ట్ అయిన నెలన్నర రోజులుగా రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబు.. అనారోగ్యం పేరిట ఎల్లో మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తూ వస్తున్నారు. చర్మ సమస్యలు ఉన్నాయని, కంటి సమస్య ఉందని, బీపీ, దీర్ఘకాలిక అనారోగ్యాలు ఉన్నాయని బెయిల్ కోసం ఇలా పలు అంశాలను విస్తృతంగా ప్రచారం చేస్తూ ప్రజల్లో సానుభూతి కోసం ప్రయత్నిస్తూ వస్తోంది. చంద్రబాబు విషయంలో సీఎం వైయస్ జగన్ ప్రభుత్వం అన్ని జాగ్రత్తలూ తీసుకోవడమే కాకుండా ఎన్నడూ లేనిది ఆయనకు ఎయిర్ కండిషనర్ కూడా ఏర్పాటు చేసింది. అయినా సరే బెయిల్ కోసం ఆయనకు లేని రోగాలను సైతం ఉన్నట్లు చూపించి పచ్చ మీడియాలో అడ్డగోలుగా ప్రచారం చేసుకున్నారు.

ఈ నేపథ్యంలో ఆయనకు షరతులతో కూడిన నాలుగు వారాల మధ్యంతర బెయిల్ ఇస్తూ... హైకోర్టు విధించిన షరతులు...

1. ఎటువంటి రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదు.

2. కేసుకు సంబంధించిన సాక్షులను ప్రభావితం చేయకూడదు. మీడియాతో మాట్లాడకూడదు.

3. ఆరోగ్య కారణాలతో మంజూరు చేసిన బెయిల్ కాబట్టి ఇల్లు, ఆసుపత్రికి మాత్రమే పరిమితం కావాల్సి ఉంటుంది.

4. చంద్రబాబుతో ఇద్దరు DSPలు ఎస్కార్ట్ ఉంచాలన్న ప్రభుత్వ అభ్యర్ధనపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలన్న న్యాయమూర్తి.

5. Z+ సెక్యూరిటీ విషయంలో కేంద్ర నిబంధనల మేరకు అమలు చేయాలని CBN సెక్యూరిటీ అంశంలో కోర్టు జోక్యం ఉండదు.