ఎట్టకేలకు వరవరరావుకు బెయిల్ మంజూరు..
Send us your feedback to audioarticles@vaarta.com
దాదాపు రెండేళ్లుగా జైలు జీవితాన్ని అనుభవిస్తున్న విరసం నేత, హక్కుల కార్యకర్త వరవరరావుకు ఎట్టకేలకు విముక్తి లభించింది. నేడు ఆయనకు ముంబై హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. వరవరరావు ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని కోర్టు షరతులతో కూడిన మెడికల్ బెయిల్‌ను మంజూరు చేసింది. ఆయన ఆరు నెలల పాటు వైద్యుల పర్యవేక్షణలోనే ఉండాలని అలాగే ముంబై విడిచి ఎక్కడికీ వెళ్లడానికి వీల్లేదని ముంబై హైకోర్టు స్పష్టం చేసింది. వరవరరావును 2018 జూన్ 18న చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ) కింద ఎన్ఐఏ అరెస్ట్ చేసింది.
2017 డిసెంబరు 31 రాత్రి పుణెలో ఎల్గార్ పరిషత్ సదస్సులో పాల్గొన్నందుకు ఆయనను, మరికొందరు హక్కుల నేతలను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను మహారాష్ట్రలోని తలోజా జైలుకు తరలించారు. అక్కడికి వెళ్లిన దగ్గర నుంచి ఆయన ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. అయితే కొన్ని నెలలుగా వరవరరావు నరాల సంబంధిత ఇబ్బందులతో పాటు ఇతర సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన కరోనా బారిన సైతం పడ్డారు. కోర్టు ఆదేశాల మేరకు ఆయనను ముంబైలోని నానావతి ఆసుపత్రికి తరలించి చికిత్సను అందించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout